Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన సుధా నారాయణ మూర్తి.. కలాం ఫోన్ చేస్తే రాంగ్ నంబర్ అని చెప్పా...

sudha murthy

వరుణ్

, బుధవారం, 26 జూన్ 2024 (10:53 IST)
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధా నారాయణ మూర్తి తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి ఒకసారి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, తాను రాసిన కాలమ్స్ చదివి ఆస్వాదించానంటూ ఆయన చెప్పారని సుధామూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మంగళవారం ఆమె ఒక ఆడియో క్లిప్‌ను షేర్ చేశారు. ఇందులో అబ్దుల్ కలామ్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఏం జరిగిందో ఓ సందర్భంలో చెప్పిన విషయాలు ఉన్నాయి. 
 
రాష్ట్రపతి భవన్ నుంచి ఫోన్ కాల్ వస్తే 'రాంగ్ కాల్' అని (ఆపరేటర్‌కి) తాను సమాధానం ఇచ్చానని సుధామూర్తి వెల్లడించారు. తన భర్త నారాయణ మూర్తికి చేయబోయి తనకు చేశారేమో అనుకున్నానని, అందుకే రాంగ్ అని కాల్ చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. అయితే 'అబ్దుల్ కలాం ప్రత్యేకంగా మీ పేరే చెప్పారు' అనడంతో తాను ఆందోళనతో పాటు ఆశ్చర్యపోయానని, ఏం చేశానని కాల్ చేస్తున్నారో అర్థం కాలేదని గుర్తుచేసుకున్నారు. అయితే 'ఐటీ డివైడ్' పేరిట తాను రాసిన కాలమ్‌ను చదివి ప్రశంసించడానికి అబ్దుల్ కలాం ఫోన్ చేశారని, చాలా బావుందంటూ తనను మెచ్చుకున్నారని సుధామూర్తి ప్రస్తావించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ... ఎట్టకేలకు సమ్మతం