Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహమ్మారి తర్వాత విదేశీ చదువుల విషయంలో ద్వితీయ- తృతీయ శ్రేణి నగరాలే ముందంజ

మహమ్మారి తర్వాత విదేశీ చదువుల విషయంలో ద్వితీయ- తృతీయ  శ్రేణి నగరాలే ముందంజ
, సోమవారం, 28 మార్చి 2022 (21:24 IST)
కోవిడ్-19 తర్వాత విద్యావ్యవస్థ రాత్రికిరాత్రి తలకిందులు అయ్యింది. విదేశీ విద్యా రంగం కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించిన డేటా ప్రకారం చూస్తే... మహమ్మారి కారణంగా 2019తో పోలిస్తే విదేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్య 2020లో 55% తగ్గిపోయింది.


ఇప్పుడు, వీసా ప్రక్రియల్లో సడలింపులతో పరిస్థితి మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంది. ఇది ఆనందించాల్సిన విషయం. సామూహిక వ్యాక్సినేషన్ కూడా అందరికి పూర్తవ్వడంతో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మార్కెట్ ఇప్పుడు మరింతగా అభివృద్ధి చెందేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ప్రాడిజీ ఫైనాన్స్‌ అందించిన డేటా కూడా దీన్ని ధృవీకరిస్తోంది.
 
విదేశీ విద్య కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కోసం కొలేటరల్-ఫ్రీ ఎడ్యుకేషన్ లోన్‌లను అందించడం, వారికి కావాల్సిన అత్యుత్తమ కాలేజీలో సీటు పొందేందుకు సహాయపడడం లాంటి కార్యక్రమాలను చేస్తోంది యూకే-ఆధారిత ఫిన్‌టెక్ కంపెనీ ప్రాడిజీ ఫైనాన్స్. ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులకు విదేశీ విద్యలో సాయం అందించి వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసింది. ఇప్పటికే 2022 మొదటి 3 నెలల్లో విదేశాలలో స్టడీ లోన్ అప్లికేషన్‌లలో 98% వృద్ధిని సాధించింది. ఇది గతేడాది అంటే 2021 మొదటి 3 నెలలతో పోలిస్తే చాలా ఎక్కువ. ఇక విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, వరంగల్- తిరుపతితో సహా ద్వితీయ మరియు తృతీయ శ్రేణి నగరాల నుంచే ఎక్కువమంది విద్యార్థులు వస్తున్నారు. ఈ నగరాల్లో వృద్ధి 176 శాతంగా నమోదైంది. 
 
రిపోర్ట్‌ ప్రకారం మరికొన్ని ఆసక్తికర అంశాలను ఒక్కసారి చూద్దాం-
 
2021లో మనం దేశం నుంచి అప్లై చేసిన టాప్‌ 5 కాలేజీల్లో ఐఎన్‌ఎస్‌ఈఏడీ, లండన్ బిజినెస్ స్కూల్, ఐఈఎస్‌ఈ బిజినెస్ స్కూల్, వార్టన్ స్కూల్, బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి. 
 
ఇక 2021లో భారతీయ విద్యార్థులు అప్లై చేసిన టాప్ 5 ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలు నార్త్‌ ఈస్ట్రన్‌ విశ్వవిద్యాలయం, కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం, అర్లింగ్టన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం, అరిజోనా స్టేట్ యూనివర్శిటీ, బఫెలో విశ్వవిద్యాలయం.
 
విదేశాల్లో చదువుకోవడం కోసం వచ్చిన దరఖాస్తుల సగటు రుణ మొత్తం 42 వేల డాలర్లు.
 
విదేశాలలో చదువుకోవడానికి ఎక్కువగా ఇష్టపడే కోర్సులు బిజినెస్‌, ఇంజనీరింగ్, హెల్త్‌కేర్, లా, పబ్లిక్ పాలసీ మరియు సైన్స్
 
67% మంది దరఖాస్తుదారులు పురుషులు కాగా 33% మంది మహిళలు ఉన్నారు. ఇక దరఖాస్తుల వృద్ధి వరుసగా 58%, 54% చొప్పున పెరిగింది.
 
ఈ సందర్భంగా డేటా నివేదికపై ప్రాడిజీ ఫైనాన్స్ కంట్రీ హెడ్ శ్రీ మయాంక్ శర్మ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... “కోవిడ్‌-19 తర్వాతి కాలంలో భారతదేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. అయితే ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణాలు ప్రారంభం కావడం, వివిధ రకాలైన పరిమితుల్లో సడలింపులు రావడం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా పూర్తవ్వడంతో... ప్రపంచ విద్యా రంగం తిరిగి పుంజుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కోసం భారతీయ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
 
విద్యార్థుల కలలను సాకారం చేయడంలో ప్రాడిజీ ఫైనాన్స్ ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల నుండి దాదాపు 25,000 మంది విద్యార్థుల కోసం $1 బిలియన్ల అమెరికన్‌ డాలర్ల విలువైన విద్యార్థి రుణాలను అందించింది. అంతేకాకుండా ఇండెక్స్ వెంచర్స్ మరియు బాల్డెర్టన్ వంటి మార్క్యూ పెట్టుబడిదారులచే మద్దతు పొందింది ప్రాడిజీ ఫైనాన్స్‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

EAMCET,ECET నోటిఫికేషన్‌లు విడుదల