Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూమ్‌కార్ కార్యకలాపాలు ప్రారంభం: మే 26- 29 మధ్య చేసుకున్న బుకింగ్స్ పై 100% తగ్గింపు

జూమ్‌కార్ కార్యకలాపాలు ప్రారంభం: మే 26- 29 మధ్య చేసుకున్న బుకింగ్స్ పై 100% తగ్గింపు
, మంగళవారం, 26 మే 2020 (19:53 IST)
లాక్‌డౌన్ 4.0 కోసం పరిమితులను సడలించిన గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) మార్గదర్శకాలను అనుసరించి భారతదేశపు అతిపెద్ద వ్యక్తిగత మొబిలిటీ వేదిక అయిన జూమ్‌కార్, పలు రాష్ట్రాలలోని 35 నగరాల్లో తన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. సామాజిక దూరాన్ని కొనసాగించడమనే ఆవశ్యకత ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, జూమ్‌కార్ నేడు తన ‘జూమ్ టు ఆత్మనిర్భరత’ అమ్మకాన్ని కూడా ఆవిష్కరించింది. ఇది వినియోగదారులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన సరసమైన వ్యక్తిగత మొబిలిటీ ఎంపికలను అందించడంలో సహాయపడుతుంది.
 
బెంగళూరు, మంగళూరు, హైదరాబాద్, వైజాగ్, చెన్నై, కోయంబత్తూర్, కొచ్చి, కాలికట్, గౌహతి, సిలిగురి మరియు భువనేశ్వర్ తదితర నగరాలతో సహా దక్షిణ మరియు తూర్పు మండలాల్లో జూమ్‌కార్ తన సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. మైసూరు, ఉత్తర మరియు పశ్చిమ జోన్లలోని ఎంపిక చేసిన నగరాల్లో, కార్లు ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
 
కస్టమర్ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, జూమ్‌కార్ ప్రతి ట్రిప్ తరువాత తన కార్ల నిశితమైన పరిశుభ్రతను నిర్ధారించే ప్రయత్నాలను వేగవంతం చేసింది. జూమ్‌కార్ తన వినియోగదారులకు ఎఐ మరియు ఎల్‌ఓటి వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని 100% కాంటక్ట్ రహిత సదుపాయంతో కార్ పికప్‌లు మరియు డ్రాప్ అప్‌లను తన లొకేషన్స్ అంతటా అందిస్తోంది. 
 
జూమ్‌కార్, తన ‘జూమ్ టు ఆత్మనిర్భరత’ అమ్మకంలో భాగంగా, మే 26 నుండి 29 వరకు ప్రారంభమయ్యే అన్ని స్వల్పకాలిక అద్దె బుకింగ్‌లపై 100% తగ్గింపు (ప్రారంభ బుకింగ్ మొత్తంలో ఫ్లాట్ 50% తగ్గింపు మరియు 50% క్యాష్‌బ్యాక్) అందిస్తుంది. వినియోగదారులు ఇప్పుడు జూన్ 01 నుండి ZAN100 కోడ్ ఉపయోగించి తమ ప్రయాణ కాలానికి బుక్ చేసుకోవచ్చు. అదనంగా, అన్ని బుకింగ్‌ల కోసం ఉచిత రీషెడ్యూలింగ్ నిరవధికంగా వర్తిస్తుంది. ఎక్కువ కాలం కార్లు అవసరమయ్యే కస్టమర్లు 1, 3 మరియు 6 నెలలు చాలా తక్కువ ధరలకే తమ సభ్యత్వాన్ని ఎంచుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగుపామును బామ్మ తోక పట్టుకుని లాక్కెళ్లి ఏం చేసిందంటే?