Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జండు వారి ఇమ్యూన్‌ ఇండియా ఆఫర్‌ ఆవిష్కరణ, శానిటైజర్ ఉచితం- స్టాక్ ఉన్నంతవరకే

Advertiesment
జండు వారి ఇమ్యూన్‌ ఇండియా ఆఫర్‌ ఆవిష్కరణ, శానిటైజర్ ఉచితం- స్టాక్ ఉన్నంతవరకే
, శనివారం, 24 అక్టోబరు 2020 (16:37 IST)
శతాబ్దాల చరిత్ర కలిగిన ఆయుర్వేదిక్‌ బ్రాండ్‌, భారతీయ ఎఫ్‌ఎంసీజీ అగ్రగామి ఇమామీ లిమిటెడ్‌ సొంతం చేసుకున్న జండూ ఇప్పుడు ‘ఇమ్యూన్‌ ఇండియా ఆఫర్‌’ను ఆవిష్కరించింది. కోవిడ్‌ 19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారతదేశానికి మద్దతునందిస్తూ, జండూ ఇప్పుడు రోగ నిరోధక శక్తి అవసరాలను తీర్చడం లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా ఈ కష్టకాలంలో ప్రతి భారతీయుడూ సురక్షిత రీతిలో పరిశుభ్రతను అనుసరించేందుకు తోడ్పడుతుంది. ప్రతి భారతీయునికీ రోగ నిరోధక శక్తి, పరిశుభ్రతను అందుబాటు ధరలలో అందించేందుకు జండూ ఈ వినూత్నమైన ఇమ్యూన్‌ ఇండియా ఆఫర్‌ను తీసుకువచ్చింది. గతంలో ఎన్నడూ జరగని రీతిలో ప్రత్యేక ధరతో జండూ చ్యవన్‌ప్రాష్‌ను అందించడంతో పాటుగా ఉచితంగా జండూ ఆయుర్వేదిక్‌ శానిటైజర్‌తో కలిపి అందిస్తుంది.
 
దీని గురించి శ్రీ హర్ష వర్థన్‌ అగర్వాల్‌, డైరెక్టర్‌, ఇమామీ లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘మనమిప్పుడు అత్యంత కష్టకాలంలో ఉన్నాం. మనదేశంతో పాటుగా ప్రపంచమంతా కూడా  కోవిడ్ 19 మహమ్మారితో పోరాడుతుంది. ఈ సమయంలో, మనందరికీ రెండు విషయాలు అత్యంత కీలకంగా మారాయి. అవి రోగ నిరోధక శక్తి మరియు పరిశుభ్రత. రోగ నిరోధకశక్తిని పెంపొందించుకోవడానికి  చ్యవన్‌ప్రాష్‌ తోడ్పడుతుందని భారత ప్రభుత్వ ఆయుష్‌ మంత్రిత్వశాఖ సూచించింది. ఈ కారణం చేత మేము 100 సంవత్సరాల జండూ యొక్క ఆయుర్వేద విజ్ఞానంపై ఆధారపడి వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు తోడ్పడాలనుకున్నాం.
 
జండూ చ్యవన్‌ప్రాష్‌ 900 గ్రాముల ప్యాక్‌పై 100రూపాయల తగ్గింపుతో పాటుగా ఇమ్యూన్‌ ఇండియా ఆఫర్‌లో భాగంగా ఆయుర్వేద శానిటైజర్‌ను సైతం ఉచితంగా అందిస్తున్నాం. తద్వారా మహమ్మారితో పోరాడుతున్న దేశానికి సహాయం అందించడం పట్ల సంతోషంగా ఉన్నాం. విభిన్న వర్గాలకు చెందిన  ప్రతి భారతీయునికీ అంతర్గతంగా మాత్రమే గాక  బాహ్య పరంగా కూడా రక్షణ అందించే ఖచ్చితమైన, అందుబాటులోని కాంబోగా ఇది నిలుస్తుందని మేము విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.
 
ఆయుర్వేదిక్‌ క్లాసిక్‌ ఫార్ములేషన్‌ జండూ చ్యవన్‌ప్రాష్‌. ఆమ్లా, గిలోయ్‌, అశ్వగంధ వంటి 39 అరుదైన వనమూలికలతో ఆయుర్వేద సార్‌ సంగ్రాహ ఆధారంగా రూపొందించబడింది. శాస్త్రీయంగా నిరూపితమైన రెండు రెట్ల రోగ నిరోధకశక్తి ఆధారిత లేబరేటరీ ఎన్‌కె (నేచురల్‌ కిల్లర్‌) సెల్‌ యాక్టివిటీతో జండూ చ్యవన్‌ ప్రాష్‌ దగ్గు మరియు జలుబు లాంటి వాటి నుంచి రక్షణ అందిస్తుంది. జీఎంపీ ధృవీకృత ప్లాంట్‌ వద్ద అత్యున్నత ప్రమాణాలతో కూడిన నాణ్యత మార్గదర్శకాలతో తయారుచేయబడిన 1-2 టీస్పూన్‌ల జండూ చ్యవన్‌ప్రాష్‌ను ప్రతి రోజూ ఉదయం పాలు లేదా తేనెతో తీసుకుంటే రోగ నిరోధక శక్తి మెరుగుపడటంతో పాటుగా శక్తినీ మరియు బలాన్నీ అందిస్తుంది. తద్వారా రోజువారీ జీవితాన్ని మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దుకోవచ్చు.
 
ఇమ్యూన్‌ ఇండియా ఆఫర్‌ హాట్‌ పిక్‌ - అబ్‌ హర్‌ ఇండియన్‌ హోగా హెల్తీ
900 గ్రాముల జండూ చ్యవన్‌ ప్రాష్‌ ఎస్‌కెయుపై 100 రూపాయల తగ్గింపు. దీనితో పాటుగా జండూ ఆయుర్వేదిక్‌ శానిటైజర్‌ను ఉచితంగా అందిస్తారు. ఈ ఆఫర్‌ స్టాక్‌ ఉన్నంత వరకూ మాత్రమే లభ్యమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నూలులో దారుణం.. పురుగుల మందు పోసి బాలికపై అత్యాచారం..