Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆయుర్వేదం కోర్సులో చేరా, యోగా నేర్చుకున్నా, పిల్లిని పెంచుతున్నా: ఇషా చావ్లా

ఆయుర్వేదం కోర్సులో చేరా, యోగా నేర్చుకున్నా, పిల్లిని పెంచుతున్నా: ఇషా చావ్లా
, మంగళవారం, 30 జూన్ 2020 (19:47 IST)
అనేక తెలుగు చిత్రాల్లో టాలెంట్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఇషాచావ్లా మళ్లీ నటిగా బిజీగా మారుతోంది. తాజాగా ఆమె న్యూలుక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆమెను చూసినవారు, తెలుగులో కథానాయికల లోటు తీరుతుందని చెబుతుండడం విశేషం. ఈ విషయాన్నే ఆమెనే అడిగితే చాలా విశేషాలు చెప్పుకొచ్చారు.
 
''ఔనండీ ! చాలామంది అదే అడుగుతున్నారు. ఎక్కడకు వెళ్లారని! ఈ లాక్ డౌన్ పీరియడ్లో అందరిలా నేనూ ముంబైలో స్ట్రక్ ఐపోయాను. మొనాటనీని అధికమించాలని ఈమధ్య ఆయుర్వేదం కోర్సులో అడ్మిషన్ తీసుకున్నాను. పనిలో పనిగా యోగా ప్రాక్టీసులో మరింత ఉన్నతి సాధించాను. యోగా ద్వారా అనేక మందిని ఈ కరోన సమయంలో మోటివేట్ చేసే అవకాశం వచ్చింది.
 
నేర్చుకున్నది సద్వినియోగం అయింది. ఇది నాకు ఎంతో ఆనందం ఇచ్చిన విషయం. ఖాళీ సమయాలలో వంటలు చేయడం, పుస్తకాలు చదవడం, మనసుకు నచ్చే సంగీతం వినడంతో ఉత్సాహం అనిపించింది. ఉదయాన్నే నిద్ర లేచి, సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయం చూస్తూ మన చుట్టు ఉన్న నేచర్ గొప్పతనం చూసి సంతోషం పొందాను. 
 
సాయంత్రాలు ఓ కప్పు టీ తాగుతూ పొందే ఆనందం చెప్పనలవి కాదు. వీటితో పాటు 2017లో ప్రారంభించిన అనన్య ఫౌండేషన్ ద్వారా అనేక మంది ప్రత్యేక అవసరాలు గల వారికి సేవలు అందిస్తున్నాం.
 
అదీకాక స్ట్రెస్‌తో బాధ పడేవారికి, ఏదో ఆలోచనలతో బాధ పడుతూ కౌన్సిలింగ్ అవసరమైన వారికి, తగిన విధంగా ఈ ఫౌండేషన్ సేవలు అందిస్తోంది. అలాంటి వ్యక్తుల కోసం ఓ హెల్ప్ లైన్ పనిచేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యువేషన్ ‌బెటర్ చేయడాని మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. స్ట్రీట్ డాగ్స్, క్యాట్స్ లాంటి యానిమల్ గార్డు కూడా ఈ హెల్ప్ లైన్ పని చేస్తోంది.
webdunia
నేను ఇటీవల ఓ పిల్లిని రిస్క్ నుండి కాపాడాను. ఇక నుండి ఆ పిల్లి సంరక్షణ బాధ్యత నాదే. ఈ వానా కాలంలో శుభ్రత- పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది హెల్ప్ లైన్. అందులో భాగంగా ‌వీధుల క్లీన్, బ్లీచింగ్ లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్నాళ్ళు పరిశ్రమకు దూరమై యు.ఎస్‌లో ఉండటం వల్ల చిత్రాలు ఓకే చేయలేదు. నేను సినీ పరిశ్రమకు దూరమైనా నటనకు దూరం కాలేదు.
 
సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్, డాన్స్ మాస్టర్ భాను నేతృత్వంలో అనేక ప్రదర్శనలు ఇచ్చాం. ముఖ్యంగా శ్రీలంకలో చేసిన షోలకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం హిందీలో ఓ వెబ్ సీరిస్‌లో చేస్తున్నా. కోవిడ్ వల్ల అది ఆలస్యం అవుతోంది. తెలుగులో రెండు, తమిళ్‌లో రెండు చిత్రాలు ఫైనల్ అయ్యాయి. మళ్ళీ తెలుగులో మరిన్ని చిత్రాలు చేయాలని ఉంది. తెలుగు రంగం నన్ను ఎప్పుడూ తన బిడ్డలా చూసుకుంటుంది. నటిగా తెలుగులోనే నా తొలి పరిచయం జరిగింది. అందుకే తెలుగు చిత్రాలకే నా ప్రాధాన్యత ఉంటుంది. ఓ రకంగా తెలుగు చిత్ర పరిశ్రమ నా పుట్టిల్లు లాంటిది. అందుకే మళ్ళీ ఇక్కడకు వచ్చినందుకు ఆనందంగా ఉంటుంది'' అంటూ తన విశేషాలు గలగల చెప్పేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమీర్ ఖాన్ ఇంటికి వచ్చిన కరోనా.. సిబ్బందిలో కొందరికి కోవిడ్..