Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏలూరులో నూతన బ్లూ స్క్వేర్‌ ఔట్‌లెట్‌ తెరిచిన యమహా

Yamaha
, శుక్రవారం, 30 డిశెంబరు 2022 (20:36 IST)
ఇండియా యమహా మోటర్‌ (ఐవైఎం) ప్రైవేట్‌ లిమిటెడ్‌ నేడు తాము నూతన బ్లూ స్క్వేర్‌ ఔట్‌లెట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ బ్లూ స్క్వేర్‌ షోరూమ్‌ను లక్ష్మీ మోటర్స్‌ పేరుతో (2000 చదరపు అడుగుల విస్తీర్ణం) సమగ్రమైన సేల్స్‌, సేవలు మరియు స్పేర్స్‌ మద్దతు అందించే రీతిలో రూపొందించారు.
 
భారతదేశవ్యాప్తంగా బ్లూ స్క్వేర్‌ షోరూమ్‌లను ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం, కంపెనీ విలువలతో వినియోగదారులు అనుసంధానించబడేందుకు ఓ వేదికను అందించడం. అలాగే బ్రాండ్‌తో భాగస్వామ్యం చేసుకోవడాన్ని వారు గర్వంగా భావించేలా అనుభూతులనూ కలిగించడం. ప్రతి బ్లూ స్క్వేర్‌ ఔట్‌లెట్‌నూ బ్లూతో అంతర్జాతీయ గ్లోబల్‌ మోటర్‌స్పోర్ట్స్‌లో యమహా పోషించిన పాత్ర యొక్క వాసరత్వంను నిర్వచించే రీతిలో తీర్చిదిద్దడం జరిగింది. దీనిలో బ్లూ, బ్రాండ్‌ యొక్క రేసింగ్‌ డీఎన్‌ఏ వెల్లడిస్తే, స్క్వేర్‌, యమహా ప్రపంచంలో ప్రవేశాన్ని వెల్లడిస్తుంది. ఈ బ్లూ స్క్వేర్‌ షోరూమ్‌లు బ్లూ స్ట్రీక్స్‌ రైడర్‌ కమ్యూనిటీకి వేదికగా కూడా నిలుస్తుంది. ఇది వినియోగదారులు ఇతర యమహా రైడర్లను కలుసుకునేందుకు అనుమతిస్తుంది.
 
బ్లూ స్క్వేర్‌ షోరూమ్‌లలో మాత్రమే విక్రయించబడే మ్యాక్సీ స్పోర్ట్స్‌ ఏరాక్స్‌ 155 స్కూటర్‌తో పాటుగా ఈ ప్రీమియం ఔట్‌లెట్స్‌లో ఏబీఎస్‌తో వైజడ్‌ఎఫ్‌-ఆర్‌15 వెర్షన్‌ 4.0 (155సీసీ); ఏబీఎస్‌తో వైజడ్‌ఎఫ్‌- ఆర్‌15ఎస్‌ వెర్షన్‌ 3.0 (155 సీసీ); ఏబీఎస్‌తో ఎంటీ-15 (155 సీసీ) వెర్షన్‌ 2.0; బ్లూ కోర్‌ టెక్నాలజీ ఆధారిత మోడల్స్‌ అయిన ఎఫ్‌జెడ్‌ 25 (249 సీసీ) ఏబీఎస్‌తో, ఫేజర్‌ 25 (249 సీసీ) ఏబీఎస్‌తో, ఎఫ్‌జడ్‌-ఎస్‌ ఎఫ్‌1 (149 సీసీ) ఏబీఎస్‌తో, ఎఫ్‌జెడ్‌-ఎఫ్‌1(14సీసీ) ఏబీఎస్‌తో; ఎఫ్‌జెడ్‌-ఎక్స్‌(149సీసీ) ఏబీఎస్‌తో మరియు యుబీఎస్‌ ఆధారిత స్కూటర్లు అయిన ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌ (125సీసీ), రేజెడ్‌ఆర్‌ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌ (125సీసీ), స్ట్రీట్‌ ర్యాలీ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌ (125సీసీ) ఉంటాయి. ఈ ప్రీమియం ఔట్‌లెట్స్‌లో అత్యంత ఆకర్షణీయంగా యమహా యాక్ససరీలు మరియు అప్పెరల్‌, విడిభాగాలు కూడా ప్రదర్శించనున్నారు.
 
నూతనంగా ప్రారంభించిన ఔట్‌లెట్లతో యమహా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఐదు బ్లూ స్క్వేర్‌ షోరూమ్‌లను నిర్వహిస్తుంది. మొత్తంమ్మీద భారతదేశంలో 137 బ్లూ స్క్వేర్‌ షోరూమ్‌లను తమిళనాడు, పాండిచేరి, కర్నాటక, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిషా, అస్సాం,  ఛత్తీస్‌ఘడ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌, ఢిల్లీ, రాజస్తాన్‌, ఇతర ఈశాన్య రాష్ట్రాలలో నిర్వహిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుట్రాలం జలపాతంలో జారిపడ్డ బాలిక.. కాపాడిన యువకుడు