దేశవ్యాప్తంగా బైకింగ్ ప్రియులకు మరింత ఉత్సాహపూరితమైన మరియు థ్రిల్లింగ్ సవారీ అనుభవాలను అందించేందుకు ఇండియా యమహా మోటర్ (ఐవైఎం) ప్రైవేట్ లిమిటెడ్ నేడు 2023 వెర్షన్ ఎఫ్‌జెడ్‌ఎస్-ఎఫ్‌ఐ వీ4 డీలక్స్, ఎఫ్‌జెడ్-ఎక్స్, ఎంటీ-15 వీ2 డీలక్స్, ఆర్15ఎంను సరికొత్త ఆకర్షణలు, ఈ శ్రేణిలో అత్యుత్తమ ఫీచర్లతో అందిస్తుంది.
150 సీసీ క్లాస్ విభాగానికి నేతృత్వం వహిస్తూ యమహా ఆర్15 ఎం, ఆర్15 వీ4 తో పాటుగా యమహా ఎఫ్‌జెఎస్-ఎఫ్‌ఐ వీ4 డీలక్స్, ఎఫ్‌జెడ్-ఎక్స్, ఎంటీ-15 వీ2 డీలక్స్ మోడల్స్ ఇప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టీసీఎస్) స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తాయి. ఈ టీసీఎస్, ఇగ్నైషన్ టైమింగ్, ఫ్యూయల్ ఇంజెక్షన్ వాల్యూమ్ నియంత్రిస్తుంది.
ఈ సందర్భంగా యమహా మోటర్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఐషిన్ చిహానా మాట్లాడుతూ, ప్రస్తుత కాల్ ఆఫ్ ద బ్లూ బ్రాండ్ క్యాంపెయిన్‌లో భాగంగా యమహా ఇప్పుడు అత్యంత ఉత్సాహపూరితమైన ఫీచర్లను భారతదేశంలో తమ అంతర్జాతీయ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో పరిచయం చేసింది. దీనిలో భాగంగానే మా 149సీసీ-155సీసీ ప్రీమియం మోటర్‌సైకిల్ శ్రేణిలో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా అందిస్తున్నాము. ఈ నూతన ఫీచర్లు మా యువ వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి అని అన్నారు. ఆయనే మాట్లాడుతూ, కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో భాగంగా నేడు ఎఫ్‌జెడ్‌ఎస్-ఎఫ్‌ఐ వీ4 డీలక్స్ మరియు ఎఫ్‌జెడ్-ఎక్స్ మోడల్స్‌ను ఈ20 ప్యూయల్ ప్రమాణాలతో ఈ సంవత్సరాంతానికి అందించనున్నాము అని అన్నారు.