Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌లోని మరిన్ని నగరాలకు తమ ద్విచక్ర వాహన సేవలను విస్తరించిన ఉబెర్

Uber

ఐవీఆర్

, శుక్రవారం, 12 జులై 2024 (22:59 IST)
ఉబెర్ ఈరోజు తమ ప్రసిద్ధ ద్విచక్ర వాహన సేవ, ఉబెర్ మోటోను రాజమండ్రి, నెల్లూరు నగరాలకు విస్తరింపజేస్తున్నట్లు వెల్లడించింది, ఇది ఆంధ్ర ప్రదేశ్ అంతటా పట్టణ చైతన్యాన్ని మెరుగుపరచాలనే దాని నిబద్ధతను మరింత స్పషంగా వెల్లడిస్తుంది. ఉబెర్ మోటో ప్రయాణికులు ఉబెర్ యాప్ ద్వారా బైక్ రైడ్‌లను సౌకర్యవంతంగా బుక్ చేసుకోవచ్చు. ఇది అవసరమైన డ్రైవర్ మరియు బైక్ వివరాలను అందించడం, జిపిఎస్ ట్రాకింగ్‌తో భద్రతను నిర్ధారించడం, టూ-వే ఫీడ్‌బ్యాక్, ట్రిప్ షేరింగ్ సామర్థ్యాల వంటి ఫీచర్లను అందజేస్తుంది. లభ్యత, యాక్సెసిబిలిటీపై బలమైన దృష్టితో, భద్రత- విశ్వసనీయత పట్ల పూర్తి నిబద్ధతతో ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఉబెర్ నిర్ధారిస్తుంది.
 
విస్తరణను గురించి ఉబెర్ ఇండియా, దక్షిణాసియా రీజినల్ బిజినెస్ ఆపరేషన్స్ హెడ్ అభిషేక్ పాధ్యే మాట్లాడుతూ, “భారతదేశం లోని టైర్ 2 మరియు 3 నగరాల్లో మా కార్యకలాపాలను  మరింతగా పెంచుకునే వ్యూహంలో భాగంగా రాజమండ్రి మరియు నెల్లూరులో ఉబెర్ మోటో సేవలను అందుబాటులోకి తీసుకురావటం మాకు చాలా ఆనందంగా ఉంది.  లక్షలాది మంది రైడర్‌లకు సరసమైన మరియు సౌకర్యవంతమైన రవాణా పరిష్కారాలను అందించడం ద్వారా వృద్ధి అవకాశాలను అన్‌లాక్ చేయడంలో మా నిబద్ధతను ఈ విస్తరణ హైలైట్ చేస్తుంది. ఇది మా 'ఇండియా టు భారత్' వ్యూహానికి అనుగుణంగా డ్రైవర్లకు గణనీయమైన ఆదాయ మార్గాలను సృష్టించే మా ప్రయత్నాలను కూడా బలపరుస్తుంది" అని అన్నారు. 
 
రాజమండ్రి మరియు నెల్లూరులో ఉబెర్ మోటో సేవలను ప్రారంభించడంతో, ఆంధ్రప్రదేశ్‌లోని రైడర్‌లకు అందుబాటులో ఉన్న రవాణా ఎంపికల పోర్ట్‌ఫోలియోను ఉబెర్  మెరుగుపరుస్తుంది, విభిన్న ఇంట్రాసిటీ మరియు ఇంటర్‌సిటీ ప్రయాణ అవసరాలను తీర్చడానికి ద్వి , మూడు మరియు నాలుగు చక్రాల వాహనాలలో సమగ్ర పరిధిని అందిస్తోంది. ఈ విస్తరణ పదివేల మందికి జీవనోపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది.
 
ఉబెర్ మోటో ట్రిప్‌ని ఎలా బుక్ చేసుకోవాలి
ఉబెర్ యాప్‌ని తెరిచి, ‘వేర్ టు’ బాక్స్‌లో మీ గమ్యస్థానాన్ని నమోదు చేయండి.
ఉబెర్ మోటోని ఎంచుకోండి.
పర్యటన ధరతో సహా బుకింగ్ వివరాలను సమీక్షించి, కన్ఫర్మ్ మోటోని నొక్కండి.
మీ రైడ్‌ని ఆస్వాదించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసిపీలో వైఎస్సార్ లేరు, జగన్ పార్టీని ఏపీ ప్రజలు గోతిలో పాతేశారు: వైఎస్ షర్మిల (video)