Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"ఆసమ్ న్యూ కార్ డెలివరీ సొల్యూషన్"తో టొయోటా కిర్లోస్కర్ మోటర్

Advertiesment
Toyota Kirloskar Motor

ఐవీఆర్

, గురువారం, 15 ఫిబ్రవరి 2024 (19:22 IST)
'కస్టమర్-ఫస్ట్ అప్రోచ్' పట్ల తమ నిబద్ధతకు అనుగుణంగా, విలువ ఆధారిత సేవల ద్వారా అద్భుతమైన కొనుగోలు అనుభవాన్ని సృష్టించటంలో భాగంగా టొయోటా కిర్లోస్కర్ మోటర్ ప్రైవేట్ లిమిటెడ్ (టొయోటా కిర్లోస్కర్ మోటర్/టికెఎం) ఈరోజు తమ "ఆసమ్ న్యూ కార్ డెలివరీ సొల్యూషన్"ను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. టికెఎం యొక్క అధీకృత డీలర్‌లు వారి విక్రయ ప్రక్రియలో భాగంగా దీనిని అమలు చేయబోతున్నారు. డీలర్ సిబ్బంది కొత్త కార్లను డెలివరీ చేసే ప్రదేశానికి డ్రైవింగ్ చేయడాన్ని తొలగించడం ద్వారా డెలివరీ టచ్‌పాయింట్‌ల వరకు వాహన లాజిస్టిక్ సేవలను విస్తరించడం కొత్త కార్యక్రమ లక్ష్యం. కొత్త కార్యక్రమంతో టొయోటా డీలర్లు కొత్త వాహనాలను డీలర్ స్టాక్‌యార్డ్‌ల నుండి తమ విక్రయ కేంద్రాలకు ఫ్లాట్-బెడ్ ట్రక్కులో రవాణా చేయడానికి వీలు కల్పిస్తుంది. లాస్ట్ మైల్ లాజిస్టిక్స్ సవాళ్లను ఎదుర్కొంటున్న గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రదేశాలలో కూడా కొత్త వాహనాలను రోడ్డుపై నడపకుండానే డీలర్‌షిప్‌ల తుది డెలివరీ అవుట్‌లెట్‌లకు కొత్త వాహనాలు చేరేలా ఇది నిర్ధారిస్తుంది.
 
ఈ ప్రోగ్రామ్ యొక్క మొదటి దశ ప్రారంభంతో, 26 రాష్ట్రాల నుండి 130 డీలర్‌షిప్‌లతో కస్టమర్‌లు, టయోటా డీలర్‌షిప్‌లలో ఈ విశ్వసనీయమైన సంతోషకరమైన కార్ కొనుగోలు అనుభవాన్ని పొందుతారు. ఈ కార్యక్రమంపై శ్రీ శబరి మనోహర్- వైస్ ప్రెసిడెంట్, సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్, టొయోటా కిర్లోస్కర్ మోటర్ మాట్లాడుతూ, "టొయోటా కిర్లోస్కర్ మోటర్‌లో, కస్టమర్-సెంట్రిసిటీకి మా నిబద్ధత చాలా ముఖ్యమైనది. మేము నిరంతరం కొత్త ఆవిష్కరణలు చేయడానికి ప్రయత్నిస్తుంటాము. "ఆసమ్ న్యూ కార్ డెలివరీ సొల్యూషన్" ప్రవేశం శ్రేష్ఠత పట్ల మా అచంచలమైన నిబద్ధతకు ఉదాహరణ. డీలర్ స్టాక్‌యార్డ్‌ల నుండి డీలర్‌కు కస్టమర్లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా క్యారియర్ సర్వీస్ ద్వారా కొత్త కార్ల తరలింపును ఇది అందిస్తోంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని మేము విశ్వసిస్తున్నాము" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేల కోట్ల అప్పులు.. జీహెచ్ఎంసీని ఆదుకోవాలి.. అక్బరుద్ధీన్ ఓవైసీ