Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తగ్గిన టమోటా-రూ.7 పలికిన కిలో టమోటా ధర

Advertiesment
Tomatoes
అనంతపురం మండలంలోని కక్కలపల్లి మార్కెట్‌లో టమోటా కిలో గరిష్ఠ ధర రూ.7తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్‌ యార్డు కార్యదర్శి రూప్‌కుమార్ తెలిపారు. 
 
మార్కెట్‌కు శుక్రవారం 24 టన్నుల దిగుబడులు వచ్చాయన్నారు. సరాసరి ధర రూ.5, కనిష్ఠ ధర రూ.3తో విక్రయాలు జరిగాయన్నారు. 
 
కూకట్‌పల్లి రైతుబజార్‌లో కిలో ధరల వివరాల్లోకి వెళితే.. టమాటా 13, వంకాయ 15, బెండకాయ 28, పచ్చిమిర్చి 45 రూపాయలకు విక్రయిస్తున్నారు.
 
సామాన్యులకు కూరగాయల ధరలు ఊరట కలిగించాయి. మార్కెట్లో టమాట, వంకాయ ధరలు తగ్గాయి. రైతు మార్కెట్లలో వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. 
 
అటు బెండకాయ, పచ్చిమిర్చి ధరల్లో మాత్రమే పెరుగుదల నమోదైంది. టమాట, వంకాయ ధరలు గత కొద్ది నెలలుగా పడిపోతూ వస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలేజీలో భగ్గుమన్న పాతకక్షలు - విద్యార్థిపై 8 రౌండ్ల కాల్పులు