రైతులకు టమోటా కన్నీళ్లు పెట్టిస్తోంది. ధర పెరిగి కాదు.. ధర తగ్గి. మొన్నటివరకు మార్కెట్‌లో రూ.200 పలికిన కిలో టమాటా.. ఇప్పుడేమో రెండు రూపాయలకే పడిపోయింది. జూన్ రెండో వారం నుంచి టమోటా ధరలు ఒక్కసారిగా పెరిగి.. సామాన్యులకు చుక్కలు చూపించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో రూ. 200 దాటింది.
కానీ, గత రెండు వారాల నుంచి టమాటా ధర నేల చూపులు చూస్తున్నాయి. కొండెక్కిన టమాటా గిట్టుబాటు ధరలు లేక పారబోసే స్థాయికి చేరుకుంది. ఏపీలో 25 కిలోల టమాటా బాక్సు రూ.10 నుంచి రూ.35 వరకూ పలుకుతోంది. అంటే కేజీ టమాటా దాదాపు 30 నుంచి 40 పైసలే. దీంతో గిట్టుబాటు ధరలు లేక రోడ్లపై టమాటాలను రైతులు పారబోస్తున్నారు