Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యానం పుష్కర ఘాట్‌లో చిక్కిన పులస - రూ.26 వేలకు విక్రయం

Advertiesment
pulasa fish
, బుధవారం, 6 సెప్టెంబరు 2023 (08:55 IST)
అత్యంత రుచికరమైన చేరగా పేరుకెక్కిన పులస చేప కోసం ధనవంతులు ఎంత ధరకైనా చెల్లించి కొనుగోలు చేస్తుంటారు. ఒక్కో సందర్భాల్లో దీని ధర ఇది వేల నుంచి లక్షల్లో కూడా పలుకుతుంది. తాజాగా యానాం పుష్కర ఘాట్‌‍లో పులస చేప ఓ జాలరికి చిక్కింది. దీన్ని ఓ మహిళ రూ.19 వేలకు కొనుగోలు చేసింది. ఆమె నుంచి మరో రాజకీయ నేత రూ.26 వేలకు దక్కించుకున్నారు. 
 
మంగళవారం సాయంత్రం యానాం పుష్కర ఘాట్‌లో ఓ జాలరి వలకు ఈ పులస చిక్కడంతో అతని పంట పండింది. రెండు కిలోల బరువున్న ఈ చేపను వేలం చేయగా నాలక్ష్మి అనే మహిళ రూ.19 వేలకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఇదే చేపను రావులపాలేనికి చెందిన ప్రముఖ నాయుకుడి కోసం ఓ వ్యక్తి రూ.26 వేలకు కొనుగోలు చేశాడు. ఈ సీజన్‌లో పులసకు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గోదావరి నదికి ఎదురీదే ఈ పులస చేప ఇతర చేపల వంటకాల కంటే అత్యంత రుచికరంగా ఉంటుంది. దీనికితోడు ఈ సీజన్‌లో మాత్రమే దొరికే ఈ చేప కోసం ధనవంతులు పోటీపడుతుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జైలు సిబ్బందికి లంచాలు..శశికళకు అరెస్ట్ వారెంట్