దేశంలో బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. వెండి ఆల్‌టైం రికార్డులను నమోదు చేయగా.. బంగారం ధరకూడా సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఈ గోల్డ్ రేటు అమాంతం పెరుగుతోంది. వెండి ధరసైతం భారీగా పెరుగుతోంది.
బలహీనపడుతున్న రూపాయి కారణంగా దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. దీనికితోడు ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్య సడలింపు.. దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో విలువైన బంగారంపై ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెడుతున్నారు.
ఇకపోతే.. తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,06,700 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,16,400కు చేరింది. అలాగే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,60,000 వద్దకు చేరింది.