బంగారం ధరలు తగ్గుతున్నాయి. నాలుగు రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. శనివారం కూడా బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల 24క్యారట్ల ధర రూ. 220 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 200 తగ్గింది. అయితే, గడిచిన నాలుగు రోజులుగా పది గ్రాముల 24 క్యారట్ల గోల్డ్‌పై రూ. 1470 తగ్గుదల చోటు చేసుకుంది. మార్చి నెలలో బంగారం రేటు మరింత తగ్గే అవకాశాలు ఉన్నట్లు ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
అయితే వెండి ధరలో శనివారం ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,05,000 వద్దకు చేరింది.