Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌లో ప్రారంభమైన ఇండియన్ కాఫీ ఫెస్టివల్

Indian Coffee Festival

ఐవీఆర్

, శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (17:33 IST)
నో స్ట్రింగ్స్ హైదరాబాద్ నిర్వహిస్తున్న మొట్టమొదటి ఇండియన్ కాఫీ ఫెస్టివల్‌కు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ సెంటర్, రోడ్ నెం. 51 వద్ద 2024 సెప్టెంబర్ 13 నుండి 15 వరకు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగనుంది. ఆసియాలో మొట్టమొదటి కాఫీ టేస్టర్‌గా ఖ్యాతి గడించిన సునాలీని మీనన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్, హైదరాబాద్ గారెత్ విన్ ఓవెన్, ఫస్ట్ క్రాక్ స్పెషాలిటీ రోస్టర్స్ ఫౌండర్ చాందిని తదితరులు పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్‌కు హాజరైనవారు కాఫీ టేస్టింగ్‌లు, లాట్ ఆర్ట్ సెషన్‌లు, నిపుణుల చర్చలు, బరిస్టా డిస్‌ప్లేలు, మరిన్నింటిని కలిగి ఉన్న కాఫీ సంస్కృతి యొక్క ఉత్సాహభరితమైన వేడుకల కోసం ఆస్వాదించవచ్చు. పిల్లలు, పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక ఈవెంట్‌లతో కుటుంబ-స్నేహపూర్వక కార్యకలాపాలను సైతం ఈ ఫెస్టివల్ అందిస్తుంది.
 
ఈ ఫెస్టివల్‌లో కథా కాఫీ, కరాఫా కాఫీ, ట్రూ బ్లాక్ కాఫీ, బిగ్ స్టార్ కేఫ్, కరాబీ కాఫీ, అరకు కాఫీ, ఎంఎస్పి హిల్ రోస్టర్స్, ఫస్ట్ క్రాక్ రోస్టర్స్, ఒడిస్సీ కాఫీలతో సహా భారతదేశంలోని కొన్ని అత్యుత్తమ కాఫీ బ్రాండ్‌లు పాల్గొంటున్నాయి. ఈ బ్రాండ్‌లు తమ సిగ్నేచర్ మిశ్రమాలు, ప్రీమియం కాఫీలను ప్రదర్శిస్తున్నాయి, సందర్శకులకు విభిన్న రకాల రుచులు, శైలులను రుచి చూసే మరియు మెచ్చుకునే అవకాశాన్ని అందిస్తున్నాయి.
 
ఈ కార్యక్రమం గురించి నిర్వాహక సంస్థ 'నో స్ట్రింగ్స్' వ్యవస్థాపకుడు శ్రీహరి చావా మాట్లాడుతూ.. 'ఉత్సాహపూరితమైన ఫుడ్ అండ్ బేవరేజ్ కల్చర్‌కు పేరెన్నికగన్న హైదరాబాద్‌కు భారతదేశంలోనే తొలి కాఫీ ఫెస్టివల్‌ను తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. కాఫీ, కేవలం ఒక పానీయం కాదు; ఇది ఒక అనుభవం. ఈ పండుగ ద్వారా, కాఫీ ప్రేమికులకు కాఫీ ప్రపంచంలో మునిగిపోయే అవకాశాన్ని అందించాలనుకుంటున్నాము" అని అన్నారు. 
 
'నో స్ట్రింగ్స్' సహ-వ్యవస్థాపకుడు అనిరుధ్ బుదితి మాట్లాడుతూ, "భారతీయ కాఫీ దృశ్యం అద్భుతమైన వేగంతో అభివృద్ధి చెందుతోంది. కొత్తగా వచ్చిన, ఇప్పటికే పేరొందిన బ్రాండ్‌లు కలిసి, కాఫీ ప్రేమికులు ఉత్సాహభరితంగా కాఫీ పట్ల తమ అభిరుచిని ప్రదర్శించే వేదికను రూపొందించడానికి మేము సంతోషిస్తున్నాము"అని అన్నారు. ఇండియన్ కాఫీ ఫెస్టివల్ , సందర్శకులు శాకాహార, వేగన్ ఎంపికలతో కూడిన అనుభవాలను ఇక్కడ పొందవచ్చు.  హైదరాబాద్‌లోని స్థానిక ప్రతిభావంతుల నుండి లైవ్ మ్యూజిక్ ప్రదర్శనలు సైతం కాఫి ప్రేమికులను ఆకట్టుకోనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సరికొత్త 'సీఆర్ఎక్స్'తో హై-స్పీడ్ విభాగంలోకి ప్రవేశించిన వారివో మోటర్