Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లగ్జరీ స్కూటర్ పోర్ట్‌ఫోలియోను పరిచయం చేసిన వెస్పా

Advertiesment
Vespa

ఐవీఆర్

, సోమవారం, 14 ఏప్రియల్ 2025 (22:52 IST)
విజయవాడ: శైలి- స్వేచ్చలకు పర్యాయపదంగా ఉన్న లెజెండరీ స్కూటర్ బ్రాండ్ వెస్పా, మహోన్నతమైన లగ్జరీ స్కూటర్‌లను అందిస్తూనే విలాస, జీవనశైలి అనుభవాలను అందించడంలో తనకంటూ ఒక కొత్త దిశను ప్రకటించింది. విజయవాడలో జరిగిన ఆకర్షణీయమైన ఆవిష్కరణ వేడుకలో, వెస్పా, ఏప్రిలియా కోసం అధీకృత మోటోప్లెక్స్ డీలర్ అయిన ఇన్నోవియా మోటర్స్ అద్భుతమైన 2025 వెస్పా పోర్ట్‌ఫోలియోను ప్రదర్శించింది.
 
దీనిని శ్రీ కె. శ్రీనివాస్ (కరూర్ వైశ్యా బ్యాంక్ మాజీ మేనేజర్), SBI బ్రాంచ్ మేనేజర్ శ్రీ బాబు రావు, గుండ్ల పుల్లారావు(శ్రీ వెంకట కనక దుర్గా ట్రావెల్స్)తో పాటుగా ఇన్నోవియా మోటార్స్ ఎండి, శ్రీ భాను ప్రకాష్‌తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2W డొమెస్టిక్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ రఘువంశీ మాట్లాడుతూ, వెస్పా మార్కెట్ లోకి వచ్చినప్పటి నుండి కేవలం రవాణా విధానం మాత్రమే కాదు.. ఇది సాంస్కృతిక చిహ్నంగా, అనేక తరాలకు స్వీయ వ్యక్తీకరణ ప్రతీకగా నిలిచింది. మా అత్యంత అధునాతన 2025 వెస్పా పోర్ట్‌ఫోలియోను నగరానికి పరిచయం చేయడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. కొత్త వెస్పాలు అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ పనితీరు, సాటిలేని అమ్మకాల తర్వాత, సేవలకు హామీని అందిస్తాయి" అని అన్నారు. 
 
వెస్పా వేరియంట్ ధర రూ. 1,33,681 (ఎక్స్-షోరూమ్, ఆంధ్రప్రదేశ్), వెస్పా ఎస్ వేరియంట్ ధర రూ. 1,37,000 (ఎక్స్-షోరూమ్, ఆంధ్రప్రదేశ్). వెస్పా టెక్ ధర రూ.1,93,483 (ఎక్స్-షోరూమ్, ఆంధ్రప్రదేశ్). వెస్పా ఎస్ టెక్ ధర రూ.1,97,360 (ఎక్స్-షోరూమ్, ఆంధ్రప్రదేశ్). ఇవన్నీ 125cc నుండి 150ccలలో లభిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గేమింగ్ కలలు, కళాత్మక నేపథ్యముల కలయికకు జీవం పోసిన కెఎల్‌హెచ్‌ జిబిఎస్ విద్యార్థులు