ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టాటా మోటార్స్ తాజాగా కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఐకానికి మోడల్ సియారాను మళ్లీ న్యూలుక్‍తో తీసుకొచ్చింది. గత 1991లో తొలిసార విడుదలైన ఈ మోడల్‌ను 2003లో నిలిపివేశారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇప్పటి అవసరాలు, హంగులతో సియారాను రీబర్త్ ఆఫ్ ఏ లెజెండ్‌గా టాటా మోటార్స్ అభివర్ణించింది. ఈ కారు ధరను రూ.11.49 లక్షల నుంచి ప్రారంభించింది. డిసెంబరు 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. టాటా డీలర్‌షిప్‍ల వద్ద గానీ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. 2026 జనవరి 15 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని వెల్లడించింది.
ఇత ఈ కొత్త సియారా విషయానికి వస్తే కొత్త సియారా పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ టర్బోఛార్జ్‌డ్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఇచ్చారు. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమెటిక్, మాన్యువల్ ఆప్షన్‌తో వస్తోంది. ఇది 160 పీఎస్ పవర్‌ను 255 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5 యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కూడా 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 7 స్పీడ్ డీసీఏతో వస్తోంది. ఇది 106 పీఎస్ పవర్, 145 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇక టర్బో డీజిల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది 118 పీఎస్ పవర్‌ను, మాన్యువల్‌లో 260 ఎన్‌ఎం, ఆటోమెటిక్‌లో 280 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా తేనున్నారు. ఇది మొత్తం ఆరు రంగుల్లో లభిస్తుంది.
పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లయిమేట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఇందులో లెవల్-2 అడాస్ ప్యాకేజీ ఇచ్చారు. మొత్తం 20 కంటే ఎక్కువ భద్రతాపరమైన ఫీచర్లు ఉన్నాయి. స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి. సీటు బెల్టు, ఎయిర్ బ్యాగులు మెరుగ్గా పనిచేసేందుకు సీట్‌బెల్ట్ యాంకర్ ప్రీ టెన్షనర్లు అమర్చారు. దీని భద్రతను పరీక్షించేందుకు టాటా సియారాను మరో సియారాతో రియల్ లైఫ్‌లో ఢీకొట్టించారు.
ఇది 5 స్టార్ రేటింగ్ మించిన భద్రతను కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్, ఇన్‌బిల్ట్ 5జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చారు. హ్యుందాయ్ క్రెటా, మారుతీ గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ వంటి మధ్య తరహా స్పోర్ట్ వినియోగ వాహనాలతో పోటీ పడబోతోంది.