Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో అత్యాధునిక సీడ్ హెల్త్ ల్యాబ్‌ను ప్రారంభించిన సిన్జెంటా వెజిటబుల్ సీడ్స్

Advertiesment
image

ఐవీఆర్

, గురువారం, 21 మార్చి 2024 (18:42 IST)
సిన్జెంటా వెజిటబుల్ సీడ్స్ ఈ రోజు హైదరాబాద్‌లో తమ సరికొత్త సీడ్ హెల్త్ ల్యాబ్‌ను ప్రారంభించింది తద్వారా నాణ్యత నియంత్రణ సామర్థ్యాలలో కంపెనీ యొక్క నిరంతర పెట్టుబడిని మరింత బలోపేతం చేసింది. ఈ అత్యాధునిక ల్యాబ్ ప్రపంచంలోనే అత్యంత అధునాతన విత్తన పరీక్షా సౌకర్యాలలో ఒకటి. భారతదేశం యొక్క మొట్టమొదటి అంకితమైన విత్తన ఆరోగ్య ల్యాబ్‌ను అందిస్తుంది, ఇది భారతదేశంతో పాటుగా ఆసియా పసిఫిక్, వెలుపల సాగుదారులకు సేవలు అందిస్తుంది.
 
హైదరాబాద్ సమీపంలోని నూతనకల్ గ్రామంలో ఉన్న ఈ ల్యాబ్, యునైటెడ్ స్టేట్స్, నెదర్లాండ్స్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌తో సహా సిన్జెంటా యొక్క కూరగాయల విత్తనాల నాణ్యత నియంత్రణ ల్యాబ్‌ల గ్లోబల్ నెట్‌వర్క్‌లో భాగమైంది, ఇది ప్రపంచ వ్యాప్తంగా అత్యున్నత నాణ్యత గల కూరగాయల విత్తన ఉత్పత్తులను అందించాలనే సింజెంటా యొక్క మిషన్‌కు మద్దతు ఇస్తుంది.
 
"అధిక-నాణ్యత, ఆరోగ్యవంతమైన విత్తనం, మా వినియోగదారులకు ఈ రంగంలో విజయానికి పునాది" అని సిన్జెంటా వెజిటబుల్ సీడ్స్- ఆసియా పసిఫిక్ హెడ్ నిశ్చింత్ భాటియా అన్నారు. “ఈ పెట్టుబడి పెంపకందారులకు ఆరోగ్యకరమైన, వ్యాధి-రహిత విత్తనాన్ని నమ్మదగిన సరఫరాను అందించాలనే మా నిబద్ధతను వెల్లడి  చేస్తుంది. ఈ ప్రపంచ స్థాయి సదుపాయం 'మేక్ ఇన్ ఇండియా', వ్యవసాయ రంగంలో భారతదేశం యొక్క పెరుగుతున్న నాయకత్వ పాత్రకు మద్దతు ఇస్తూ, ప్రపంచ విత్తన ఎగుమతిదారుగా మారాలనే లక్ష్య సాకారానికి తోడ్పాటు అందిస్తుంది" అని అన్నారు.  
 
"గ్లోబల్ సీడ్ స్టీవార్డ్‌షిప్, విత్తన రంగంలో విత్తన ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, సాగుదారుల పంటల సమగ్రతను కాపాడటం, ప్రపంచ సరఫరా గొలుసులను, ప్రపంచ ఆహార భద్రతను కాపాడటంలో కీలకం" అని సిన్జెంటా వెజిటబుల్ సీడ్స్- ఫ్లవర్స్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ గ్లోబల్ హెడ్ ఎరిక్ పోస్ట్మా అన్నారు.  “సాగుదారునికి అందించే ప్రతి విత్తనం పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మొత్తం విత్తన పరిశ్రమ యొక్క భాగస్వామ్య బాధ్యత, అందుకే అంతర్జాతీయ ఫైటోసానిటరీ ప్రమాణాలకు మద్దతు ఇవ్వడానికి ఇతర విత్తన కంపెనీలకు మా విత్తన పరీక్ష సేవలను అందించడం మాకు గర్వకారణం" అని అన్నారు.
 
సిన్జెంటా యొక్క హైదరాబాద్ సైట్ మొట్టమొదట 2009లో స్థాపించబడింది. ఇక్కడ 250 కంటే ఎక్కువ మంది ఫుల్ టైం, సీజనల్ ఉద్యోగులు, కార్మికులు వున్నారు. వీరు విత్తన ప్రాసెసింగ్, నాణ్యత నియంత్రణ- సరఫరా కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లయిన మహిళను ప్రేమించి ఆమెతో పరార్: పట్టుకుని మూత్రం తాగించి గుండు కొట్టారు