Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మార్చి 31వ తేదీ ఆదివారమే... అయినా బ్యాంకులకు పనిదినమే : ఆర్బీఐ గవర్నర్

reserve bank of india

ఠాగూర్

, గురువారం, 21 మార్చి 2024 (12:03 IST)
ఆర్థిక సంవత్సరం 2023-24 మార్చి 31వ తేదీతో ముగియనుంది. అయితే, మార్చి 31వ తేదీన ఆదివారం వస్తుందిం. దీంతో ఆ రోజున బ్యాంకులకు పనిదినమా లేదా అనే సందిగ్ధత నెలకొంది. దీనిపై భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత్ దాస్ వివరణ ఇచ్చారు. మార్చి 31వ తేదీ ఆదివారమే అయినప్పటికీ అన్ని ఏజెన్సీ బ్యాంకులు పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం 2023-24కి మార్చి 31 చివరి రోజు కావడంతో ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన లావాదేవీలను నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏజెన్సీ బ్యాంకుల బ్రాంచ్‌లు తెరిచే ఉంచాలని సూచించారు. 
 
ప్రభుత్వ రశీదులు, చెల్లింపులతో ముడిపడిన బ్యాంకుల శాఖలన్నీ మార్చి 31వ తేదీన (ఆదివారం) తెరిచి ఉంచాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అవసరమైన బ్రాంచులను తెరిచి ఉంచుతున్నామని, సేవలు లభిస్తాయంటూ ప్రచారం కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలిచ్చింది. కాగా బ్యాంకులు సాధారణంగా అన్ని ఆదివారాలు, ప్రతి నెల 2, 4వ శనివారాల్లో మూసి ఉంటాయనే విషయం తెల్సిందే. అయితే, ఈ మార్చి 31వ తేదీన ఆదివారం రావడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
ప్రస్తుతం దేశంలో బ్యాంకుల విలీనం తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకులుగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఉన్నాయి. 
 
షెడ్యూల్డ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్, డీసీబీ బ్యాంక్ లిమిటెడ్, ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లిమిటెడ్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్, కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్, కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, ఆర్బీఎల్ బ్యాంక్ లిమిటెడ్, సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్, యస్ బ్యాంక్ లిమిటెడ్, ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్, బంధన్ బ్యాంక్ లిమిటెడ్, సీఎస్బీ బ్యాంక్ లిమిటెడ్, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ జాబితాలో ఉన్నాయి. ఇక విదేశీ బ్యాంకుల జాబితాలో డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తండ్రి చేతుల్లోంచి జారిపడి పసికందు దుర్మణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో..!!