సుప్రసిద్ధ ఆర్ధిక సేవల కంపెనీ సింక్రోనీ, తమ ఉద్యోగులందరికీ శాశ్వత వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం, ఉద్యోగులు- వారి కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే చురుకైన, పరిశ్రమలో సుప్రసిద్ధమైన వర్క్‌ప్లేస్ నమూనాను స్వీకరించడం పట్ల కంపెనీ నిబద్దతకు నిదర్శనంగా నిలువడంతో పాటుగా తమ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో మద్దతునందించాలనే లక్ష్యమూ ప్రతిబింబించి, అందరికీ అనుకూలమైన పని వాతావరణాన్ని సైతం ప్రోత్సహిస్తుంది.
సానుభూతి, నమ్మకం అనే అంశాలపై కేంద్రీకృతమై కంపెనీ తీసుకున్న ఈ చర్యలు తమ ఉద్యోగుల సంఖ్యను విస్తృతం చేయడంలో సహాయపడుతుంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభావంతులను చేరువకావడానికి తోడ్పడుతూనే, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పరంగా ఎలాంటి రాజీపడకుండా తమ అత్యుత్తమతను అందించడానికి తోడ్పడుతుంది.
కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి భద్రత, సౌకర్యం, ఎంపికపై సింక్రోనీ దృష్టి కేంద్రీకరించడంతో పాటుగా వినూత్నమైన ప్రయోజనాలనూ అందించింది. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే వ్యాపార నిర్ణయాలతోపాటుగా సమకాలీన మార్గాలలో పనిచేసే అవకాశం కల్పించడం ద్వారా ఈ కంపెనీ ఎప్పుడూ కూడా తమ ఉద్యోగులకు మొదటి స్థానం అందిస్తుంది.
సింక్రోనీ వద్ద మేమెప్పుడూ కూడా ఉద్యోగులను మా ఆస్తిగా భావిస్తుంటాము. దీనితో పాటుగా మేము ఎక్కడ పనిచేసినా అక్కడ మహోన్నతమైన కార్యక్రమాలను చేయగలమని భావిస్తున్నాము. వారి విజయానికి మేము కట్టుబడి ఉన్నాము. మా ఉద్యోగులు అత్యుత్తమంగా ఉండటానికి మద్దతునందించే కార్యక్రమాలకు మద్దతునందించడం ద్వారా అధిక విశ్వాసం కలిగిన సంస్కృతిని నిర్మించడం సాధ్యమవుతుంని భావిస్తున్నాము. సానుకూల, సాధికారిత కలిగిన పని వాతావరణాలు సంతోషకరమైన శ్రామిక శక్తికి కీలకం. మహోన్నతమైన కార్యాలయ సంస్కృతిని కొనసాగించడంలో మాకు సహాయపడుతుంది అని ఆండీ పొన్నేరీ, ఎస్‌వీపీ, బిజినెస్ లీడర్ ఇండియా, సింక్రోనీ అన్నారు.
ఈ పాలసీ జూన్ 27,2022 నుంచి అమలులలో ఉంటుంది. హైదరాబాద్‌లోని సింక్రోనీ ప్రధాన కార్యాలయం పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్న ఉద్యోగులకు తెరిచి ఉంటుంది. కంపెనీ యొక్క ఎంగేజ్‌మెంట్ వ్యూహానికి కేంద్రంగా ఇది ఉంటుంది. దీనిలో ఉద్యోగులు పనిచేసేందుకు రావడం లేదా ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం, సహచర ఉదోగులతో నెట్‌వర్క్ చేసుకోవడం చేయవచ్చు. అదనంగా, ఉద్యోగులందరూ ఇంటి వద్ద నుంచి పనిచేసే అవకాశం ఉండటంతో, సింక్రోనీ ఇప్పుడు రీజనల్ ఎంగేజ్‌మెంట్ హబ్స్‌ను హైదరాబాద్ వెలుపల ప్రాంతాలలో వర్ట్యువల్, వ్యక్తిగత అనుసంధానిత కార్యక్రమాల కోసం ప్రారంభించింది. ఈ ఎంగేజ్‌మెంట్ హబ్స్, రెగ్యులర్ కనెక్షన్ అవకాశాలను 100% వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను ఎంచుకున్న ఉద్యోగులకు అందిస్తుంది.
ఈ నిర్ణయం గురించి అంగీ అలెన్, ఎస్‌వీపీ, హ్యూమన్ రిసోర్శెస్-ఆసియా మాట్లాడుతూ మహమ్మారి కాలమంతటా మేము మా ఉద్యోగులను మా నిర్ణయాలలో అత్యంత కీలకంగా ఉంచాము. గత 2.5 సంవత్సరాలుగా మేము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పట్ల ఉద్యోగుల ధోరణులు, మారిన పనివాతావరణ తీరు గురించి నేర్చుకుంటూనే ఉన్నాము. మహమ్మారి నుంచి మెరుగైన అవకాశాలను వారు అంచనా వేస్తున్నారు. మా నూతన మార్గపు వర్కింగ్, సౌకర్యం, ఎంపిక వంటి అవకాశాలపై దృష్టి కేంద్రీకరించడంతో పాటుగా శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేయడం వంటి అవకాశాలను అందిస్తుంది. అంతేకాదు, మేము వారిని వింటున్నామనే భరోసానూ కల్పించింది. ఈ కార్యక్రమం మా ఉద్యోగులకు ఖచ్చితంగా మద్దతునందిస్తుందనడంలో మాకు ఎలాంటి సందేహమూ లేదు. ఇది మా సంస్కృతి పట్ల నమ్మకం పెంచడంతో పాటుగా మా మొత్తం వ్యాపారానికి ప్రయోజనం కలిగించనుంది అని అన్నారు.
భారతదేశంలో పనిచేసేందుకు అత్యుత్తమ కంపెనీలలో ఒకటిగా సింక్రోనీని 2022 సంవత్సరానికిగానూ గ్రేట్ ప్లేస్ టు వర్క్ గుర్తించింది. తమ జాబితాలో 19వ ర్యాంకును కట్టబెట్టింది. ఈ గుర్తింపు కోవిడ్-19 మహమ్మారి ద్వారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ శ్రద్ధ కలిగిన, సమ్మిళిత, సహకార, వినూత్నమైన వాతావరణాన్ని సృష్టించడానికి సింక్రోనీ చేస్తోన్న ప్రయత్నాలను వెల్లడిస్తుంది. ఈ కంపెనీ ఇటీవలనే టాప్ 30 బీఎఫ్‌ఎస్‌ఐగా గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా-2022 గుర్తించింది.
సింక్రోనీలో ప్రస్తుతం 47% మంది ఉద్యోగులు మహిళలు. వీరితో పాటుగా 100 మందికి పైగా దివ్యాంగులు పనిచేస్తున్నారు. అలాగే 25 మంది వెటరన్స్, వారి కుటుంబ సభ్యులు భారతదేశంలో కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో భాగంగా ఉన్నారు. 2021లో సింక్రోనీని భారతదేశంలో అత్యుత్తమమైన టాప్ 10 కంపెనీలలో ఒకటిగా డైవర్శిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ పరంగా గుర్తించడంతో పాటుగా భారతదేశంలో మహిళలు పనిచేసేందుకు అనువైన టాప్ 50 కంపెనీలలో ఒకటిగానూ గుర్తించారు.