Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెక్ డొనాల్డ్స్ ప్రోటీన్ ప్లస్ బర్గర్స్ విడుదలకి స్విగ్గీ, మెక్ డొనాల్డ్ ఒప్పందం

Advertiesment
Burger

ఐవీఆర్

, బుధవారం, 30 జులై 2025 (22:39 IST)
జులై 24 నుండి ఆగస్ట్ 11 వరకు స్విగ్గీ యాప్ పై ప్రత్యేకంగా లభించే తమ ప్రోటీన్ ప్లస్ బర్గర్స్ శ్రేణిని విడుదల చేయడానికి మెక్ డొనాల్డ్ ఇండియాతో భాగస్వామం గురించి స్విగ్గీ లిమిటెడ్, భారతదేశపు ప్రముఖ ఆన్-డిమాండ్ కన్వీనియెన్స్ ప్లాట్ ఫాం, ఈ రోజు ప్రకటించింది. కస్టమర్లు స్విగ్గీ యాప్ యొక్క ‘హై ప్రోటీన్’ విభాగాన్ని సందర్శించడం ద్వారా ఈ ఆరోగ్యవంతమైన శ్రేణి నుండి తమకు ఇష్టమైన బర్గర్లను ఆర్డర్ చేయవచ్చు. ఈ శ్రేణి ముంబయి, బెంగళూరు, పూణె, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, కొచ్చీ, వైజాగ్, సూరత్, మైసూర్ వంటి నగరాలు సహా పశ్చిమ, దక్షిణ భారతదేశపు రాష్ట్రాల్లోని 58 నగరాల్లో స్విగ్గీ యూజర్లకు అందుబాటులో ఉంటుంది.
 
మెక్ డొనాల్డ్స్ వారి రియల్ ఫుడ్ రియల్ గుడ్ జర్నీలో భాగంగా, మెక్ డొనాల్డ్ ప్రోటీన్ ప్లస్‌ను ప్రారంభించింది. సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సహకారంతో ఈ వినూత్నమైన, ఆరోగ్యకరమైన శ్రేణి అభివృద్ధి చేయబడింది. ప్రోటీన్ ప్లస్ శ్రేణితో, మెక్ డొనాల్డ్ బర్గర్స్ ఇప్పుడు రుచితో రాజీపడకుండా పోషకాలను పెంచి అందిస్తున్నాయి. కస్టమర్లు ఇప్పుడు తమకు ఇష్టమైన బర్గర్స్‌లో పెరిగిన ప్రోటీన్‌ను ఆనందించవచ్చు. ఈ శ్రేణిలో బెస్ట్-సెల్లింగ్ వెజిటేరియన్, నాన్-వెజిటేరియన్ బర్గర్లు ఉన్నాయి- మెక స్పైసీ ప్రీమియం వెజ్, క్రిస్పీ వెజ్జీ బర్గర్, మెక్ వెజ్జీ, మెక్ స్పైసీ పనీర్, మెక్ స్పైసీ ప్రీమియం చికెన్, మెక్ క్రిస్పీ చికెన్ బర్గర్, మెక్ చికెన్, మసాలా మెక్ ఎగ్, మెక్ స్పైసీ చికెన్. ప్రతి ప్రోటీన్ ప్లస్ స్లైస్ శాకాహార సోటా, పీ ప్రోటీన్ తో తయారైన 5 గ్రాముల ఉన్నతమైన నాణ్యత గల ప్రోటీన్‌ను అందిస్తుంది. వీటిలో కృత్రిమ రంగులు లేదా రుచులు లేవు, ప్రతి స్లైస్‌కు కేవలం 34 kcal చేర్చే సమయంలో ఎంతగానో అభిమానించే మెనూ పదార్థాల మొత్తం ప్రోటీన్ పదార్థం పెరిగింది.
 
ఈ భాగస్వామం గురించి వ్యాఖ్యానిస్తూ, శ్రీ. సిద్ధార్ధ భకూ, ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్, స్విగ్గీ ఫుడ్ మార్కెట్ ప్లేస్ ఇలా అన్నారు, “ఆన్ లైన్లో మిల్లెట్ బన్ శ్రేణితో మెక్ డొనాల్డ్స్ ప్రోటీన్ ప్లస్, బర్గర్స్ విడుదల కోసం మేము ప్రత్యేకమైన ప్లాట్ ఫాంగా ఉండటానికి మేము గర్విస్తున్నాం. తమ ఆహారాల్లో ప్రోటీన్ ప్రాధాన్యత గురించి వినియోగదారులకు చైతన్యం కలిగిన కారణంగా, వారు తమకు ఇష్టమైన వస్తువులను వెంటనే వదిలేయరని మాకు తెలుసు. ఈ కొత్త శ్రేణి విడుదల అనేది వినియోగదారుల ప్రోటీన్ వినియోగాన్ని పెంచడానికి తీసుకున్న ఒక చర్య మాత్రమే కాకుండా తమకు ఇష్టమైన బర్గర్‌ను ఆనందించడానికి వారికి వీలు కల్పిస్తుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే, భారతదేశపు వినియోగదారు కోసం మరింత అధికంగా ప్రోటీన్ ఉత్పత్తులను విడుదల చేయడానికి రాబోయే నెలల్లో మెక్ డొనాల్డ్స్‌తో మేము భాగస్వాములుగా అవుతామని నేను ఖచ్చితంగా చెప్పగలను.”

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్