Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్టోరీటెల్ సెలెక్ట్ వార్షిక చందా ఇప్పుడు కేవలం రూ. 399 మాత్రమే

స్టోరీటెల్ సెలెక్ట్ వార్షిక చందా ఇప్పుడు కేవలం రూ. 399 మాత్రమే
, గురువారం, 21 అక్టోబరు 2021 (23:17 IST)
స్టోరీటెల్... ఇప్పుడు వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తున్న మాధ్యమం. ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన స్టోరీటెల్ గతేడాది ‘సెలెక్ట్’ అనే ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ మోడల్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా చందాదారులు 11 ప్రాంతీయ భాషలలో కంటెంట్ ఎంచుకోవచ్చు. గతంలో స్టోరీటెల్‌ సెలెక్ట్‌ యొక్క వార్షిక చందా రూ.1198 ఉండేది. కానీ ఇప్పుడు చందాదారుల సౌలభ్యం కోసం వార్షిక చందాని బాగా తగ్గించి… ఏడాదికి రూ.399గా మార్చారు. ఈ తగ్గింపుతో… గతంలో పొందిన 11 ప్రాంతీయ భాషలలోని కథలను ఇప్పుడు కూడా పొందవచ్చు. దీనిద్వారా చందాదారులకు మరిన్ని కథలను అందిస్తూ వారి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుంటుంది స్టోరీటెల్‌.
 
రూ .399ల వార్షిక చందాతో ఏడాది మొత్తం యాక్సెస్ ఇవ్వడం వినియోగదారులు పెరిగేందుకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం, ఈ యాప్ 2 లక్షల కంటే ఎక్కువ పుస్తకాలను హోస్ట్ చేస్తోంది. అంతేకాకుండా ప్రతి వారం మరిన్ని టైటిల్స్ యాడ్‌ అవుతున్నాయి. స్టోరీటెల్‌ని మరింత మంది శ్రోతలకు అందుబాటులో ఉండేలా చెయ్యాలనే లక్ష్యంలో భాగంగానే ధరలను తగ్గించారు.
 
"ఆడియో బుక్స్‌కి మార్కెట్‌లో రోజురోజుకి డిమాండ్‌ పెరుగుతోంది. అలాగే ఆడియో బుక్స్ ద్వారా మరింత సమాచారం తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా వినియోగదారుల్లో రోజురోజుకి పెరుగుతోంది. 11 ప్రాంతీయ భాషల్లోని కథలను అన్‌లిమిటెడ్‌ యాక్సెస్‌తో తక్కువ వార్షిక చందాతో అందించడం వెనుక ఉన్న మా ఉద్దేశ్యం ఒక్కటే. కథలను పాకెట్ ప్రెండ్లీగా మార్చడమే. వినియోగదారులు ఎల్లప్పుడూ కొత్త తరహా వినోదాన్ని ప్రయత్నించడానికి సిద్ధంగా ఉంటారు. అనుకూలమైన ధర వద్ద కొనుగోలుచేయాలనే ఆసక్తి కలుగుతుంది. ప్రతిఒక్కరికీ కథలను అందుబాటులోకి తీసుకురావడమే స్టోరీటెల్ లక్ష్యం. సబ్‌స్క్రిప్షన్ చందా రూ.399కు తగ్గించటం ద్వారా కథలు వినే అలవాటు అందరిలో పెరగాలని ఆశిస్తున్నట్టు స్టోరీటెల్ ఇండియా కంట్రీ మేనేజర్ యోగేష్ దశరథ్ అన్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపకా పడుకొనేతో భాగస్వామ్యం చేసుకున్న అంతర్జాతీయ స్పోర్ట్స్‌వేర్‌ బ్రాండ్‌ అడిడాస్‌