Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైల్వేలో 3378 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. చెన్నై పెరంబూరులో..

Advertiesment
Southern Railway Recruitment 2021
, శుక్రవారం, 4 జూన్ 2021 (10:12 IST)
రైల్వేలో 3378 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్ రైల్వే పెరంబూర్‌లోని క్యారేజ్ అండ్ వేగన్ వర్క్స్‌కి చెందిన చీఫ్ వర్క్ షాప్ మేనేజర్ కార్యాలయం వివిధ ట్రేడ్స్‌లో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
 
మొత్తం ఖాళీలు : 3378
అర్హతలు: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటిఐ, ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు : 15 సంవత్సరాలు నిండి ఉండాలి. 24 సంవత్సరాలు దాటకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో మినహాయింపు వర్తిస్తుంది.
 
ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్ ఆధారంగా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 30/6/2021
 
ఖాళీగా ఉన్న విభాగాలు: ఫ్రెషర్ కేటగిరి, ఎక్స్ ఐటిఐ, ఎంఎల్ టి
ట్రేడ్స్ : వెల్డర్, ఫిట్టర్, కార్పెంటర్, పెయింటర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పాసా, ఎలక్ట్రీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షర్మిల కొత్త పార్టీకి అధ్యక్షుడు ఆయన అయితే... మరి షర్మిల సంగతేంటి?