Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండిగో సంక్షోభం.. శబరిమలకు 140 ప్రత్యేక రైళ్లు.. దక్షిణ మధ్య రైల్వే ప్రకటన

Advertiesment
Trains

సెల్వి

, మంగళవారం, 9 డిశెంబరు 2025 (10:13 IST)
శబరిమల మండలపూజ, మకర విళక్కు కోసం భారీ ఎత్తున అయ్యప్ప భక్తులు కేరళ వెళ్తున్నారు. మరోవైపు ఇండిగో విమానాలను రద్దు కావడంలాంటి కారణాలతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇండిగో వివిధ విమానాశ్రయాల నుండి అనేక విమానాలను రద్దు చేయడంతో ఈ ప్రత్యేక రైళ్లు అయ్యప్ప భక్తులు శబరిమల చేరుకోవడానికి సహాయపడతాయని ఎస్‌సీఆర్ సీపీఆర్ఓ చెప్పారు. 
 
ఇందులో భాగంగా భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) దాదాపు 140 శబరిమల ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు శ్రీధర్ తెలిపారు. వివిధ స్టేషన్లలో ఆగుతున్న ఈ ప్రత్యేక రైళ్లు మకర జ్యోతి దర్శనం వరకు నడుస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లు సిర్పూర్ కాగజ్‌నగర్ నుండి కొల్లం, చర్లపల్లి నుండి కొల్లం, నర్సాపూర్ నుండి కొల్లం, ఇతర గమ్యస్థానాల నుండి కూడా పలు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.
 
ఈ ప్రత్యేక రైళ్లు బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట, పాలక్కాడ్ రోడ్, పాలకూరు, తిరుపూరు, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, తిరువల్ల, చెంగన్నూర్, కాయంకుళం, ఇతర స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Coffee Rythu Bazaars: కాఫీ రైతులకు మద్దతు.. రైతు బజార్లు ఏర్పాటు