Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానానికి వెరైటీ పేరు.. కామస్కూత్ర.. అక్టోబర్ 2న ప్రారంభం

సింగపూర్ ఎయిర్‌లైన్స్ 12వ బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ అనే విమానానికి ఆసక్తికరమైన పేరు పెట్టింది. ఈ పేరంటేనే అందరికీ తెలిసేలా ఉండాలనుకుంది. ఇంకా సింగపూర్‌కు రాకపోకలు సాగించే భారతీయులను ఆకట్టుకునే రీతిలో వ

Advertiesment
సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానానికి వెరైటీ పేరు.. కామస్కూత్ర.. అక్టోబర్ 2న ప్రారంభం
, గురువారం, 1 సెప్టెంబరు 2016 (16:24 IST)
సింగపూర్ ఎయిర్‌లైన్స్ 12వ బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ అనే విమానానికి ఆసక్తికరమైన పేరు పెట్టింది. ఈ పేరంటేనే అందరికీ తెలిసేలా ఉండాలనుకుంది. ఇంకా సింగపూర్‌కు రాకపోకలు సాగించే భారతీయులను ఆకట్టుకునే రీతిలో విమానానికి పేరు పెట్టింది. ఇంతకీ ఆ పేరు కోసం కామసూత్ర అనే పదాన్ని ఎంచుకుంది. ఈ పదంలో కాస్త మార్పు చేసి, కొత్తగా ఆకట్టుకునేలా పేరు పెట్టాలని డిసైడ్ అయ్యింది. అందుకే సూత్రలోని స్కూట్‌ను ఎంచుకుంది.  
 
ఇంకా 787కి ''కామస్కూత్ర'' అనే పేరును నిర్ణయించింది. పేరు కాస్త డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ, ఫన్నీగా ఉండాలని ఈ పేరు పెట్టినట్లు.. స్కూట్ ఇండియా హెడ్ భరత్ మహాదేవన్ వెల్లడించారు. అక్టోబరు 2న సింగపూర్-జైపూర్ మధ్య ‘కామస్కూత్ర’ విమానాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. కాగా ఈ ఏడాది మేలో చెన్నై, అమృత్‌సర్ నుంచి స్కూట్ తన సర్వీసులు నడుపుతున్న సంగతి తెలిసిందే. 
 
ఈ విమానానికి పెట్టే పేరు కోసం ప్రపంచ దేశాల్లో మారుమోగుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ పేరును, సచిన్ పేరును, బర్త్ డే, జెర్సీ నెంబర్లను పరిగణనలోకి తీసుకున్నామని చివరికి కామస్కూత్రను ఖరారు చేసినట్లు భరత్ మహాదేవన్ వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో టారిఫ్ ఇదే... రూ. 12,000 కోట్లు నష్టపోయిన ఐడియా, ఎయిర్‌టెల్