Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో టారిఫ్ ఇదే... రూ. 12,000 కోట్లు నష్టపోయిన ఐడియా, ఎయిర్‌టెల్

ఉచిత ఇంటర్నెట్ పేరిట సంచలనం సృష్టించిన జియో ఇన్ఫోకామ్ భవిష్యత్ ప్రణాళికను పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ వెల్లడించారు. టెలికామ్ కంపెనీలకు షాక్ ఇస్తూ ఇటీవలే రిలయన్స్‌లో చేరిన జియో గురించి గురువారం జరిగ

ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో టారిఫ్ ఇదే... రూ. 12,000 కోట్లు నష్టపోయిన ఐడియా, ఎయిర్‌టెల్
, గురువారం, 1 సెప్టెంబరు 2016 (16:03 IST)
ఉచిత ఇంటర్నెట్ పేరిట సంచలనం సృష్టించిన జియో ఇన్ఫోకామ్ భవిష్యత్ ప్రణాళికను పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ వెల్లడించారు. టెలికామ్ కంపెనీలకు షాక్ ఇస్తూ ఇటీవలే రిలయన్స్‌లో చేరిన జియో గురించి గురువారం జరిగిన 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అనిల్ అంబానీ మాట్లాడుతూ.. కస్టమర్లకు వరాల జల్లు కురిపించారు. దేశంలో 2017 నాటికి 90శాతం గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ముకేశ్ అంబానీ వెల్లడించారు. 
 
ఇంకా 5జీ 6 జీ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. 5 పైసలకే ఒక ఎంబీ, రూ.50కే జీవీ డాటా సేవలను అందించనున్నట్టు ప్రకటించారు. 300 పైగా ఛానల్స్ లైవ్‌లో చూడొచ్చు. అలాగే 28 లక్షల కాలర్ టూన్స్, 6 వేల సినిమాలు, 60 వేల మ్యూజిక్ ఉచితంగా పలు అప్లికేషన్స్ అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా పది ప్రధాన ప్లాన్లతో ముందుకు వస్తున్నట్టు ముకేశ్ ప్రకటించారు. 
 
ఇకపోతే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డ్రీమ్ ప్రాజెక్టు డిజిటల్ ఇండియాకు జియో సేవలను అంకితం చేయనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. దేశంలో కాకుండా ప్రపంచంలో అతి తక్కువ ధరలకు జియో సేవల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. రిలయన్స్ జియో సేవలద్వారా ఏ నెట్ వర్క్‌కైనా ఉచిత రోమింగ్, ఉచిత వాయిస్ కాల్స్ సేవలు అందిస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి భారతీయుడి జీవితం డిజిటల్‌గా రూపాంతరం చెందబోతోందన్నారు ఇందులో జియో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇంకా దేశంలో కోటి వైఫై కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. 
webdunia
 
రిలయన్స్ జియోను పరిచయం చేస్తుండగానే ఐడియా సెల్యులార్, భారతీ ఎయిర్‌టెల్ కంపెనీలు రూ. 12,000 కోట్ల మేర నష్టపోయాయి. ఈ కంపెనీల ఈక్విటీ వాటా విలువ మధ్యాహ్నం ఐడియా 9.58 శాతం నష్టంతో రూ. 84.50 వద్ద, భారతీ ఎయిర్‌టెల్ 6.30 శాతం నష్టంతో రూ. 310.75 వద్దా కొనసాగుతున్నాయి. జియో దెబ్బకు బాగా నష్టపోయిన టాప్ కంపెనీల్లో ఐడియా, ఎయిర్‌టెల్ నిలిచాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేశ్ శర్మ అలా చెప్తే.. ఫ్రాన్స్ ప్రధాని ఇలా చెప్పారేంటి? ఎద అందాలను కప్పుకోవద్దంటున్నారు..