Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పారిశ్రామిక బేరింగ్స్ పోర్ట్ ఫోలియోను విస్తరించిన షాఫ్లర్ ఇండియా

Advertiesment
Schaeffler India Expands its Large Size Industrial Bearings

ఐవీఆర్

, బుధవారం, 6 ఆగస్టు 2025 (22:21 IST)
షాఫ్లర్ ఇండియా, ప్రముఖ మోషన్ టెక్నాలజీ కంపెనీ, మేడ్-ఇన్-ఇండియా పెద్ద సైజ్ స్పియరికల్ రోలర్ బేరింగ్స్, కాస్ట్ స్టీల్ హౌసింగ్స్, యాక్ససరీస్‌ను చేర్చి ఇప్పటికే ఉన్న పారిశ్రామిక పోర్ట్ ఫోలియోను విస్తరించడం ద్వారా తమ స్థానిక నిబద్ధతను మరింత శక్తివంతం చేసింది. మా స్థానిక ప్రయత్నాలను అత్యధికం చేయడానికి కొనసాగింపుగా, ఈ బేరింగ్స్ సావ్లి, గుజరాత్ లోని షాఫ్లర్ ఇండియా వారి ఆధునిక తయారీ సదుపాయంలో తయారు చేయబడ్డాయి.
 
ఉక్కు, సిమెంట్, మైనింగ్, విద్యుత్తు ప్లాంట్స్, గుజ్జు- కాగితం వంటి కీలకమైన రంగాల్లో హెవీ-డ్యూటీ వినియోగాల కోసం కంపెనీ వారి పారిశ్రామిక పోర్ట్ ఫోలియో గణనీయంగా విస్తరించడాన్ని ఈ ప్రారంభం సూచిస్తుంది. బేరింగ్స్ పోర్ట్ ఫోలియోకు అనుబంధపూరకంగా, కంపెనీ పెద్ద-సైజ్ కాస్ట్ స్టీల్ హౌసింగ్స్, అడాప్టర్, విత్ డ్రాల్- హైడ్రాలిక్ స్లీవ్స్‌ను పరిచయం చేసింది. షాఫ్లర్ నుండి పూర్తి పోర్ట్ ఫోలియోను ఎంచుకోవడానికి ఇవి ఇప్పుడు OEMలు, కన్సల్టెంట్స్‌ను కూడా అందిస్తున్నాయి. తీవ్రమైన ఆపరేటింగ్ పరిస్థితుల్లో ఉన్నతమైన శక్తి, మన్నికను కేటాయించడానికి హౌసింగ్స్ రూపొందించబడ్డాయి. అడ్వాన్స్ డ్ సీలింగ్, అంతర్గత లూబ్రికేషన్ గ్రూవ్, వైబ్రేషన్-టెంపరేచర్ సెన్సర్లను మౌంటింగ్ చేయడానికి ఏర్పాటు, ఆటో-లూబ్రికేటర్లు వంటి అదనపు డిజైన్ ఫీచర్లు మెరుగుపరచబడిన సామర్థ్యం, నమ్మకం మరియు నిర్వహణ సౌలభ్యానికి వీలు కల్పిస్తాయి.
 
ఈ ప్రకటన గురించి మాట్లాడుతూ, శ్రీ. శేషన్ అయ్యర్, ప్రెసిడెంట్- బేరింగ్స్- ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ ఇలా అన్నారు, “ఈ ప్రారంభం అనేది మేక్-ఇన్-ఇండియాకు షాఫ్లర్ నిబద్ధతను- స్థానిక ఇంజనీరింగ్, పరిశోధన-అభివృద్ధి సామర్థ్యంతో కలిసిన తయారీ శ్రేష్టతపై మా నిరంతర కేంద్రీకరణను సూచిస్తోంది. ఈ కీలకమైన భాగాల యొక్క తయారీని స్థానికం చేయడం ద్వారా, మా పరిష్కారాలు మరింత అందుబాటులో, సరసంగా, భారతదేశపు పరిశ్రమ అవసరాలకు స్పందించే విధంగా మేము చేస్తున్నాము.
 
ఉన్నతమైన నాణ్యత, విలువచే ప్రోత్సహించబడిన పరిష్కారాలకు డిమాండ్ పెరుగుతున్న నేపధ్యంలో, మేము మా అంతర్జాతీయ నైపుణ్యాన్ని భారతదేశానికి తీసుకురావడానికి, మా కస్టమర్లకు వేగంగా, మెరుగ్గా సేవలు అందించడానికి మా సామర్థ్యాన్ని శక్తివంతం చేయడానికి గర్విస్తున్నాం.” పూర్తి పరిష్కారాల సమూహంలో బేరింగ్స్, హౌసింగ్స్, అడాప్టర్, విత్ డ్రాల్ స్లీవ్స్, అడ్వాన్స్ డ్ సీలింగ్ పరిష్కారాలు, లూబ్రికెంట్లు, కండిషన్ మానిటరింగ్ వ్యవస్థలు ఉన్నాయి- ఇవి చలన పరిష్కారాల కోసం షాఫ్లర్‌ను నమ్మకమైన, సింగిల్-విండో భాగస్వామిగా నిలిపాయి. ఈ కొత్త ఉత్పరత్తులు కన్వేయర్లు, స్టేకర్ రిక్లైమర్లు, గేర్ బాక్స్ లు, క్రషర్స్, పల్పింగ్ సిస్టంస్ సహా భారీ పరిశ్రమకు మద్దతునిచ్చే వినియోగాల్లో కీలకమైన పారిశ్రామిక రంగాలకు ప్రయోజనం చేకూర్చనున్నాయి.
 
స్థానిక తయారీ, అప్లికేషన్ ఇంజనీరింగ్ సామర్థాయలలో షాఫ్లర్ ఇండియా వారి నిరంతర పెట్టుబడి భారత ప్రభుత్వం వారి “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమంతో అనుసంధానం చెందింది. భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే మోషన్ టెక్నాలజీలతో భారతదేశపు పరిశ్రమ యొక్క అభివృద్ధి చెందుతున్న అవసరాలను మద్దతు చేయడానికి కంపెనీ వారి దీర్ఘకాలిక నిబద్ధతను ఇది చూపిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం