భారతదేశంలోని అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్, ఈరోజు తమ అతిపెద్ద ఫెస్టివ్ క్యాంపెయిన్- సూపర్ బిగ్ సెలబ్రేషన్స్‌ను ప్రకటించింది, ఇది విజన్ ఏఐ శక్తివంతమైన ప్రీమియం బిగ్ స్క్రీన్ టీవీలపై సాటిలేని డీల్‌లు, రివార్డులను అందిస్తుంది. అక్టోబర్ 31, 2025 వరకు అందుబాటులో వుండే ఈ ఆఫర్లతో, ఈ పండుగ సీజన్‌లో వినియోగదారులు తమ వినోద అనుభవాన్ని అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఆఫర్‌లలో భాగంగా సామ్‌సంగ్ తన ఏఐ టీవీ శ్రేణిలో ప్రత్యేకమైన ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్, రివార్డులను అందిస్తోంది. జీఎస్టీ రేట్ల తగ్గింపు కారణంగా వినియోగదారులు ధరల తగ్గింపు నుండి కూడా ప్రయోజనం పొందుతారు.
సామ్‌సంగ్ యొక్క సూపర్ బిగ్ సెలబ్రేషన్స్ సమయంలో, జీరో డౌన్ పేమెంట్ ఎంపికలు మరియు 1 ఈఎంఐ ఆఫ్ ఆఫర్‌తో పాటు వినియోగదారులు నెలకు కేవలం రూ. 990 నుండి ప్రారంభమయ్యే ఈఎంఐలతో 30 నెలల వరకు సులభమైన ఫైనాన్స్‌ను పొందవచ్చు. ఇవన్నీ ప్రీమియం బిగ్ స్క్రీన్ టీవీకి అప్‌గ్రేడ్ చేయడం మరింత సౌకర్యవంతంగా చేస్తాయి. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై 20% వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా సామ్‌సంగ్ అందిస్తోంది, ఇది పండుగ సీజన్‌లో వినియోగదారులకు మరింత ఆదా చేయడంలో సహాయపడుతుంది.
ఈ సంతోషాన్ని మరింత పెంచుతూ, ఎంపిక చేసిన బిగ్ స్క్రీన్ సామ్‌సంగ్ టివి మోడళ్ల కొనుగోలుదారులు రూ. 92,990 వరకు విలువైన సామ్‌సంగ్ సౌండ్‌బార్ లేదా రూ. 1,40,490 వరకు విలువైన ఏఐ టివిని అందుకుంటారు, ఇది ఇంట్లో పూర్తి సినిమాటిక్ అనుభవాన్ని సృష్టిస్తుంది. దీర్ఘకాలిక మనశ్శాంతిని నిర్ధారించడానికి, సామ్‌సంగ్ ఎంపిక చేసిన పెద్ద స్క్రీన్ టీవీలపై 3 సంవత్సరాల వారంటీని పొడిగిస్తోంది.