Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘పెహ్లే జైసీ బాత్‌ నహీ’ పాటను వయాకామ్‌18 భాగస్వామ్యంతో విడుదల చేస్తున్న రాయల్‌ స్టాగ్‌ బూమ్‌బాక్స్‌

Advertiesment
image
, బుధవారం, 26 జులై 2023 (22:19 IST)
వయాకామ్‌18 సహకారంతో బాలీవుడ్‌ మెలోడీని హిప్‌- హాప్‌ గల్లితో సమ్మిళితం చేస్తూ పూర్తి సరికొత్త జోనర్‌కు శ్రీకారం చుడుతూ చేపట్టిన మొట్టమొదటి సంగీత ప్రయోగం రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్. సంగీతం అనేది అన్ని వయస్సుల వారిలో భావోద్వేగాలను రేకేత్తిస్తుంది. సీగ్రామ్ రాయల్ స్టాగ్‌కు ఇది కీలక పునాదిరాయిగా నిలిచింది. ఈ ఆధునిక యుగపు యువ ప్రేక్షకులు ఉత్తేజకరమైన కొత్త సంగీత స్వరూపాలను అన్వేషించడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. 'లివింగ్ ఇట్ లార్జ్' స్ఫూర్తిని అందిపుచ్చుకొని మణిపాల్, భువనేశ్వర్, పూణే, ఇండోర్ & డెహ్రాడూన్‌లోని వేలాది మంది సంగీత ప్రియులను తనదైన ప్రత్యేక అనుభూతి ద్వారా ఆకట్టుకున్న రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ 4 ఒరిజినల్ మ్యూజిక్ వీడియోలతో తదుపరి దశలోకి ప్రవేశించనుంది. విడుదల చేస్తున్న మొట్టమొదటి ఒరిజినల్ మ్యూజిక్ ట్రాక్ సోల్ సింగింగ్ క్వీన్‌ జస్లీన్ రాయల్, స్పంకీ రాపర్ డినో జేమ్స్ మధ్య ప్రత్యేకమైన సహకారంతో రూపుదిద్దుకుంది.
 
బాలీవుడ్‌ వైబ్‌, హిప్‌-హాప్‌ బీట్స్‌ కలబోతతో రూపొందించి అద్భుతమైన బీట్స్‌ ప్రతిధ్వనించే కలయితో కూడిన సరికొత్త పాట 'పెహ్లే జైసీ బాత్ నహీ'. ఈ సంగీతం నేటి యువతను ఆకట్టుకుంటుంది. ఒక యువ జంట రిలేషన్‌షిప్‌ సమస్యలు, కోల్పోయిన ప్రేమ కోసం పరితపించడం, దాన్నుంచి వచ్చే వ్యామోహ భావనను తెలియజెప్పే పాట ఇది. రాయల్‌ స్టాగ్‌ బూమ్‌బాక్స్‌ వారి ప్రత్యేకమైన ఫిజిటల్‌ ఫార్మట్‌లో వివిధ వేదికలపై విడుదల కానున్న మెలోడి X హిప్‌-హాప్‌ నాలుగు ఒరిజినల్స్‌లో ఇది మొదటిది.
 
ఈ సందర్భంగా ర్యాపర్‌ డినో జేమ్స్‌ మాట్లాడుతూ, “రాయల్‌ స్టాగ్‌ బూమ్‌బాక్స్‌ వారు రూపొందించిన ఈ వినూత్న సంగీత ప్రయోగంలో నేను భాగం కావడం ఎంతో సంతోషంగా ఉంది. సంగీతంపై నాకున్న విభిన్నమైన ఆలోచనకు ఈ సరికొత్త పాట ప్రతిబింబంగా నిలుస్తుంది. ఈ పాటలో మేము పండించిన ఆర్తితో కూడిన భావోద్వేగాలను జనం తమలో తాము చూసుకుంటారని ఆశిస్తున్నాను” అన్నారు. గాయని జస్లీన్‌ రాయల్‌ మాట్లాడుతూ, “ఏదైన ప్రత్యేకమైనది సృష్టించాలనే ఆలోచన గాయనిగా నేను బాగా ఇష్టపడతాను. ఆ ప్రయోగానికి రాయల్‌ స్టాగ్‌ బూమ్‌ బాక్స్‌ ఒక చక్కని వేదిక. “పెహ్లే జైసీ బాత్‌ నహీ” లో ఉన్న ప్రేమ, అభిరుచి, శక్తిని ప్రేక్షకులు ఎలా అందుకుంటారనే దాని కోసం నేమ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో భారీ వర్షాలు.. కృష్ణమ్మకు జలకళ.. వరదలతో ప్రజల తంటాలు