Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైడ్ నౌ, పే ఇన్ 2026- యెజ్డీ, BSA మోటార్ సైకిల్ బంపర్ ఆఫర్

Advertiesment
Ride

ఐవీఆర్

, శనివారం, 18 అక్టోబరు 2025 (20:59 IST)
క్లాసిక్ లెజెండ్స్, అథెంటిక్ పెర్ఫార్మెన్స్ క్లాసిక్స్‌ను మళ్ళీ స్టైలుగా ముందుకు తెస్తూ, రైడ్ నౌ, పే ఇన్ 2026 (ఇప్పుడు రైడ్ చెయ్యండి, 2026లో చెల్లించండి) ప్రారంభించింది. దీనితో రైడర్లు తమ కలల మోటార్ సైకిల్‌ను ఈ రోజు ఇంటికి తీసుకువెళ్ళి, దానికి ఇఎమ్ఐలను కేవలం 2026లో చెల్లించటం ప్రారంభించవచ్చు. దేశంలో అగ్రగామి అయిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో ఒకటి అయిన L అండ్ T ఫైనాన్స్ భాగస్వామ్యంలోని ఈ కొత్త ఆఫర్, తన క్లాసిక్ మోటార్­సైకిళ్ళను మరింత చేరువకు తేవాలన్న, మోటార్ సైక్లింగును మరింత ఆనందదాయకంగా మార్చాలన్న కంపెనీ నిబద్ధతకు అద్దం పడుతుంది.
 
కావలసిన డౌన్ పేమెంటు తర్వాత, తమకు ప్రియమైన జావా, యెజ్డీ లేదా BSA మోటార్ సైకిల్ డెలివరీని కొనుగోలుదారులు ఇప్పుడు పొందగలుగుతారు. ఋణ వితరణ జరిగిన తేదీ తర్వాత మొదటి రెండు నెలల పాటు, కేవలం ప్రోగుబడిన వడ్డీని మాత్రమే చెల్లించవచ్చు, ఎటువంటి మూలధనపు EMIలు బకాయిపడరు. ఉదాహరణకు, ఒకవేళ ఋణవితరణ అక్టోబర్ 2025లో జరిగితే, మొట్టమొదటి రెగ్యులర్ EMI జనవరి 2026లో ప్రారంభమవుతుంది. మొత్తం ఋణం టెన్యూర్ 36 నెలల వరకు విస్తరించి ఉండవచ్చు, ఋణం తిరిగి చెల్లించటం 38 నెలల్లో పూర్తవుతుంది. వీటిలో EMI హాలీడే కాలం కూడా ఉంటుంది. BSA గోల్డ్ స్టార్ 650, విలక్షణంగా కనిపించే విధంగా రూపొందించిన, GST 2.0కి ముందు ధరలో లభిస్తున్నఅసలైన బ్రిటీషు మోటార్ సైకిల్ కొనుగోలు కోసం కూడా ఈ ప్రత్యేక పండుగ ఫైనాన్సింగ్ స్కీమ్ లభిస్తోంది.
 
శరద్ అగర్వాల్, ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్, క్లాసిక్ లెజెండ్స్ ప్రై. లి., ఇలా అన్నారు, చాలామంది రైడర్లకు, మా మోటార్ సైకిళ్ళను స్వంతం చేసుకోవటం, ఒక వాస్తవికతకు సంబంధించిన విషయం మాత్రమే కాక, క్లాసిక్ మోటార్­సైకిల్ యొక్క భావనాత్మకమైన ఆకర్షణ కూడా. మేము అందిస్తున్న రైడ్ నౌ, పే ఇన్ 2026 ఆఫర్, ఈ సంబరాల సీజన్లో నిర్ణయాన్ని తీసుకోవటాన్ని సులభం చేస్తుంది, మరింత ప్రత్యేకతను నింపుతుంది. మా కొనుగోలుదార్లు జావా, యెజ్డీ లేదా BSAలకు వెంటనే స్వాగతం పలుకవచ్చు, మరో వంక మా ఈ ఆఫర్ 2026 వరకు EMI చెల్లింపుల వత్తిడిని వారి మీద నుండి తొలగిస్తుంది.
 
జినేష్ షా, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్, అర్బన్ సెక్యూర్డ్ అసెట్స్ & థర్డ్-పార్టీ ప్రోడక్ట్స్, L&T ఫైనాన్స్ లి., ఇలా అన్నారు, క్లాసిక్ లెజెండ్స్‌తో భాగస్వామ్యం, ప్రత్యేకించి ఆనందకరమైన పండుగ సీజన్ సమయంలో, మాకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ రైడ్ నౌ, పే ఇన్ 2026 ఆఫర్, మా కస్టమర్లు కావాలనుకున్నవారికి నిజంగా లాభాన్ని కలిగిస్తుంది. ఆర్ధికపరమైన సౌలభ్యాన్ని ఆఫర్ చేయటం ద్వారా, చారిత్రాత్మకమైన మోటార్ సైకిల్‌ను స్వంతం చేసుకోవాలన్న కలను నిజం చేసుకునేందుకు సహకారాన్ని అందిస్తున్నాము. మా కస్టమర్లు, మమ్మల్ని ఫైనాన్షయర్‌గా ఎంచుకుని, ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకుంటారని మేము విశ్వసిస్తున్నాము.
 
ఈ స్కీమ్ యొక్క వడ్డీ రేట్లు 6.99 శాతం నుండి ప్రారంభం అవుతాయి. ఇందులో ఒక చిన్న డౌన్ పేమెంట్ ఉంటుంది. 10 నిముషాల లోపు (స్కీమ్ యొక్క షరతులను అనుసరించి) ఋణం తక్షణం ఆమోదించబడుతుంది. 2025 నవంబర్ 30వ తేదీ వరకు, భారతదేశ వ్యాప్తంగా 450కి పైగా అధీకృత జావా యెజ్డీ, BSA డీలర్షిప్‌ల వద్ద లభిస్తున్న ఈ ఆఫర్ కోసం అర్హతను పొందేందుకు మౌలికమైన బ్యాంకింగ్ డాక్యుమెంటేషన్ కావలసి ఉంటుంది.
 
పండుగ సీజన్లో ఇప్పటికే, కొత్త 2025 యెజ్డీ రోడ్‌స్టర్, అడ్వెంచర్ మరియు అవార్డు గెలుచుకున్న జావా 42 FJతో సహా జావా, యెజ్డీ శ్రేణికి అద్భుతమైన ప్రతిస్పందన లభించింది. జాగ్రత్తగా ఆలోచించి రూపొందించిన ఈ కొత్త ఫైనాన్స్ ఆప్షన్‌తో క్లాసిక్ లెజెండ్స్, తన పెర్ఫార్మెన్స్ క్లాసిక్ మోటార్ సైకిళ్ళను సులభంగా స్వంతం చేసుకోగలగాలని, వాటి సవారీని మరింత ఆనందమయం చేయాలని సంకల్పించింది. అన్ని క్లాసిక్ లెజెండ్ మోటార్­సైకిళ్ళకు, ఈ సెగ్మెంటులో పరిశ్రమలోనే ఈ తరహా మొట్టమొదటి కార్యక్రమమైన ఒక సమగ్రమైన జావా యెజ్డీ BSA ఓనర్­షిప్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ సహకారం లభిస్తోంది.
 
4-ఏళ్ళు/50,000 కిమీ స్టాండర్డ్ వారెంటీ : ఈ కార్యక్రమం ఆఫర్ చేస్తోంది సెగ్మెంటులో అగ్రగామి సంరక్షణ. ఇంజనీరింగ్‌లో మా నైపుణ్యానికి ఇది అద్దం పడుతుంది. తమ మోటార్­సైకిళ్ళు దీర్ఘకాలం మన్నగలవని రైడర్లకు మనఃశాంతిని ఇస్తుంది.
 
ఆరు సంవత్సరాల వరకు అదనపు వారెంటీ ఆప్షన్లు: ఈ ప్రీమియం కవరేజ్ భరోసాతో చెబుతుంది – బైక్ రోడ్ కోసం సంసిద్ధంగా ఉంటుందని, ఊహించని రిపెయిర్ ఖర్చుల విషయంలో ఒత్తిడిని తట్టుకుంటుందని.
 
రెండు-సంవత్సరాల ఎనీటైమ్ వారెంటీ (యాజమాన్యపు ఆరు సంవత్సరాల లోపు): అవసరమైనప్పుడు జోడించగలిగిన ఒక సౌలభ్యవంతమైన సొల్యూషన్. స్టాండర్డ్ వారెంటీ గడువు ముగిసినప్పటికీ, కస్టమర్లకు కవరేజ్ ఎప్పటికీ ముగిసిపోకుండా హామీ ఇస్తుంది.
 
ఒక ఏడాది కాంప్లిమెంటరీ రోడ్­సైడ్ సహాయం: ఎనిమిదేళ్ళ వరకు విస్తరింపజేయవచ్చు; రైడర్లకు అవసరమైనప్పుడు, అవసరమైన చోట సహకారం తప్పక అందేట్లు జాగ్రత్త వహిస్తుంది, వారు ఎక్కడా, మారుమూల ప్రదేశాల్లో కూడా చిక్కుబడి పోకుండా ఉండేందుకు సహకరిస్తుంది.
 
ఐదేళ్ళ సమగ్ర AMC ప్యాకేజ్: అంచనా వేయగలిగిన ఖర్చుకు లభించే అవాంతరాలు లేని సర్వీసింగ్, ఇది ఊహించని ఖర్చులను తొలగించి సుఖమైన ఓనర్షిప్ అనుభవాన్ని అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డయల్ బిఫోర్ యు డిగ్ అని కోరుతున్న థింక్ గ్యాస్