Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డయాగ్నోస్టిక్‌ స్టార్టప్స్‌ గరిష్ట సామర్థ్యం కోసం 'రిచ్' దరఖాస్తులకు ఆహ్వానం

Advertiesment
డయాగ్నోస్టిక్‌ స్టార్టప్స్‌ గరిష్ట సామర్థ్యం కోసం 'రిచ్' దరఖాస్తులకు ఆహ్వానం
, శనివారం, 6 ఫిబ్రవరి 2021 (21:23 IST)
మార్కెట్‌ కోసం తమ డయాగ్నోస్టిక్‌ ఉత్పత్తులను వేగవంతంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న స్టార్టప్స్‌, వ్యాపారవేత్తల కోసం తమ స్టార్టప్‌ యాక్సలరేటర్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు దరఖాస్తులను రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (రిచ్‌) ఆహ్వానిస్తోంది. తెలంగాణా ప్రభుత్వ మద్దతుతో పాటుగా భారత ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ ఎడ్వైజర్‌ తోడ్పాటుతో ఇప్పుడు ఆవిష్కరణలతో మార్కెట్‌లను చేరుకునేందుకు శాస్త్రీయ స్టార్టప్‌ పర్యావరణ వ్యవస్ధను సమూలంగా మార్చేందుకు రిచ్‌ లక్ష్యంగా చేసుకుంది.
 
తమ ఎయిడ్‌ కార్యక్రమంలో భాగంగా, రిచ్‌ ఇప్పుడు స్టార్టప్స్‌, వ్యాపారవేత్తలు, పరిశోధకులు, విద్యాసంస్థల నుంచి దరఖాస్తులను తమ యాక్సలరేటర్‌ కార్యక్రమం కోసం ఆహ్వానిస్తుంది. ఈ దరఖాస్తులను పరిశ్రమ నిపుణులతో కూడిన న్యాయనిర్ణేతల బృందం పరిశీలిస్తుంది. ఎంపిక చేయబడిన స్టార్టప్స్‌కు సీసీఎంబీ లాంటి పరిశోధనా సంస్థల వద్ద తర్ఫీదునివ్వడంతో పాటుగా అత్యున్నత స్థాయి పరిశోధనా సదుపాయాలు, యంత్రసామాగ్రి వినియోగించుకునే అవకాశమూ కలుగతుంది. దీనితో పాటుగా సుప్రసిద్ధ సాంకేతిక, వ్యాపార నిపుణుల నుంచి మెంటార్‌షిప్‌ పొందడంతో పాటుగా నమూనాలు, పరీక్షలు, వాలిడేషన్‌ కోసం ఆస్పత్రుల బెడ్స్‌ వినియోగించుకునే అవకాశమూ కలుగుతుంది. విజయవంతమైన ఫలితాలను సాధించిన స్టార్టప్స్‌కు సీడ్‌ గ్రాంట్లను సైతం అందిస్తారు.
 
ఈ సందర్భంగా రిచ్‌ డైరెక్టర్‌ జనరల్‌, అజిత్‌ రంగ్నేకర్‌ మాట్లాడుతూ, ‘‘శాస్త్ర రంగంలో పరిశోధనలు ప్రపంచాన్ని సమూలంగా మార్చే సామర్థ్యం  కలిగి ఉన్నాయి. డయాగ్నోస్టిక్స్‌లో, భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, డాటా నిపుణులు అత్యంత వేగంగా సృజనాత్మక నూతన ఉత్పత్తులను కనుగొనడం వల్ల ఎన్నో వ్యాధులను ముందుగానే గుర్తించి, వాటి బారి నుంచి మానవాళిని కాపాడటంలో సహాయపడుతున్నారు’’ అని అన్నారు.
 
ఎయిడ్‌ కార్యక్రమం కోసం దరఖాస్తులను 17 ఫిబ్రవరి 2021వ తేదీ వరకూ స్వీకరిస్తారు. డయాగ్నోస్టిక్‌ పరిశ్రమలో మీరు ఔత్సాహిక వ్యాపారవేత్త అయి ఉండి, మీ స్టార్టప్‌ అత్యున్నత స్థాయి డయాగ్నోస్టిక్‌ ఉపకరణాలను అభివృద్ధి చేయగలదన్న విశ్వాసం ఉంటే వెంటనే దరఖాస్తు చేసేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత రత్న ప్రచారం ఆపండి ప్లీజ్: రతన్ టాటా విజ్ఞప్తి