Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త్వరలోనే మార్కెట్‌లోకి రిలయన్స్ 5జీ ఫోన్.. ధర ఎంతంటే?

reliance 5g smart phone
, మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (19:51 IST)
దేశ టెలికాం రంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించిన రిలయన్స్ మొబైల్స్ కంపెనీ కొత్తగా 5జీ ఫోన్లను ప్రవేశపెట్టనుంది. దేశంలో 5జీ సేవలు వచ్చే నెల నుంచి ఎంపిక చేసిన ప్రధాన నగరాల్లో ప్రారంభంకానున్నాయి. దీంతో 5జీ ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. 
 
నిజానికి దేశంలో కోట్లాది మంది 2జీ, 3జీ మొబైల్ వినియోగదారులను 4జీ మొబైల్ సేవల్లోకి తీసుకొచ్చిన ఘనత రిలయన్స్‌కే దక్కుతుంది. ఇపుడు 4జీ మొబైల్ వినియోగదారులను 5జీ మొబైల్ సేవల వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులోభాగంగా 5జీ టెక్నాలజీ స్మార్ట్ ఫోనును ప్రవేశపెట్టనుంది. 
 
జియోఫోన్ నెక్స్ట్ పేరుతో తీసుకొచ్చే ఈ ఫోన్ ధర కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. సెర్చ్ ఇంజిన్ గూగుల్‌తో కలిసి తయారు చేస్తున్న ఈ జియోఫోన్ నెక్స్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ.8 వేల నుంచి రూ.12 వేల మధ్య ఉండే అవకాశం ఉందని కౌంటర్ పాయింట్ రీసెర్స్ నివేదిక వెల్లడించింది. ఈ ధరను ఈ ఫోన్ తయారీలో వినియోగిస్తున్న విడి భాగాల ధరల ఆధారంగా లెక్కించింది. 
 
దేశంలో 5జీ నెట్‌వర్క్‌ కొంత విస్తరించిన తర్వాత రిలయన్స్‌ తమ ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. దీంట్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ పరికరాల కోసం క్వాల్‌కామ్‌, శామ్‌సంగ్‌, సింటియంట్‌ సహా కొరియా, చైనాకు చెందిన కంపెనీలతో జియో భాగస్వామ్యం కుదుర్చుకొంది.
 
కాగా, వచ్చే 2023-2024 నాటికి జియో 5జీ వినియోగదారుల సంఖ్య 1.2 కోట్లకు, 2024-25 నాటికి 2.1 కోట్లకు చేరే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ స్పార్క్‌ క్యాపిటల్‌ అంచనా వేసింది. 4జీ ధరలతో పోలిస్తే 5జీ సేవల ధరలు 20 శాతం అధికంగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భాగ్యనగరిలో ముంచెత్తిన వర్షం - రోడ్లపై భారీగా నీరు.. స్తంభించిన ట్రాఫిక్