Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ శీతాకాలంలో తన ఆరోగ్యం కాపాడుకునేందుకు రష్మిక మండన్న ఏం చేస్తుంటారు?

ఈ శీతాకాలంలో తన ఆరోగ్యం కాపాడుకునేందుకు రష్మిక మండన్న ఏం చేస్తుంటారు?
, బుధవారం, 15 డిశెంబరు 2021 (20:41 IST)
డిసెంబర్‌లో ఆకాశం ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. పున్నమి వెన్నెల జాబిలి చూసిన తరువాత తక్షణమే ప్రకృతి ప్రేమలో పడిపోతాం. ఇంత అందాన్ని కనుల ముందుంచే ఈ నెలలోనే దగ్గు, జలుబు లాంటి లక్షణాలు కూడా అధికంగా కనిపిస్తుంటాయి. శీతగాలులతో వాతావరణ మార్పు కారణంగా మన శరీర ఆరోగ్యం కోసం అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మన శ్వాస ఆరోగ్యం నిర్వహించుకోవడంలో అత్యంత కీలకంగానూ ఇది నిలుస్తుంది.

 
ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండటంతో పాటుగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే రష్మిక మండన్న, ఎప్పుడూ కూడా తన  అభిమానులకు తన ఆరోగ్య చిట్కాలను చెబుతూ స్ఫూర్తి కలిగిస్తుంటారు. గృహ చిట్కాల పట్ల అమిత నమ్మకం కలిగి ఉన్న వ్యక్తిగా, సంప్రదాయంగా వినియోగించే పదార్థాలతో పాటుగా యోగా ప్రాక్టీస్‌ చేయడానికి అమితంగా ఇష్టపడతారామె.  తన ఆరోగ్యం దగ్గరకు వచ్చే సరికి తన తల్లిదండ్రుల భయాలు గురించి కూడా ఆమె చెబుతుంటారు. ఈ కారణం చేతనే ఈ సీజన్‌లో దగ్గు, జలుబు వంటి లక్షణాలను పోగొట్టుకోవడం కోసం ఆమె ఇంటి చిట్కాలనూ పాటిస్తుంటారు.

 
తన ఆరోగ్య రహస్యం గురించి రష్మిక మాట్లాడుతూ, ‘‘సుదీర్ఘకాలం పాటు షూటింగ్‌లు చేయడంతో పాటుగా అత్యుత్తమ నటన కనబరచడానికి నేనెప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ రద్దీ జీవితంలో నాకు ఆనందాన్ని కలిగించేది అందమైన డిసెంబర్‌ సాయంత్రాలు. ఎంతగా షూటింగ్‌లను ఆస్వాదించినా ఈ కాలంలో మాత్రం సులువుగా దగ్గు, జలుబు బారిన పడుతుంటాను. నాకు దగ్గు, జలుబు లక్షణాలు కనిపించిన ప్రతిసారీ మా అమ్మ నాకు విక్స్‌వాపోరబ్‌తో ఆవిరి తీసుకోవడాన్ని అలవాటు చేశారు.

 
ఇప్పటికీ నాకు బాగా గుర్తు. నేను విద్యార్థిగా స్కూల్‌ ట్రిప్స్‌కు వెళ్లినప్పుడు మా అమ్మ నా ఆరోగ్యం పట్ల అమితంగా ఆందోళన పడేవారు. విక్స్‌ వాపోరబ్‌లో ఉన్న కర్పూరం, యూకలిప్టస్‌, మెంథాల్‌ లాంటివి సాధారణ జలుబు, దగ్గు వంటి లక్షణాల నుంచి ఉపశమనం అందిస్తాయి. ఇప్పటికీ నాతో పాటుగా విక్స్‌ వాపోరబ్‌ తీసుకువెళ్తాను. సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పని వ్యాయామం, యోగాలాంటివి నా రోజువారీ షెడ్యూల్‌లో భాగమే అయినప్పటికీ షూటింగ్‌ షెడ్యూల్‌ బిజీగా ఉన్నప్పుడు, అదీ నిత్యం వాతావరణం మారుతున్నప్పుడు మాత్రం విక్స్‌ వాపోరబ్‌ ఆవిరులు తీసుకుంటుంటాను’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరు జిల్లాలో మళ్లీ వింత శబ్ధాలు.. ఏంటా అని చూస్తే..?