Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైల్వే బోర్డు సీఈవోగా తొలిసారి ఓ మహిళకు ఛాన్స్

Advertiesment
jaya varma sinha
, గురువారం, 31 ఆగస్టు 2023 (16:57 IST)
రైల్వే బోర్డు ఛైర్ పర్సన్, సీఈవోగా దేశంలో తొలిసారి ఓ మహిళకు కేంద్రం అవకాశం ఇచ్చింది. రైల్వే బోర్డు కొత్త సీఈవోగా జయావర్మ సిన్హాను ఎంపిక చేశారు. ఇప్పటివరకు ఆమె రైల్వే బోర్డు సభ్యురాలిగా కొనసాగుతూ వచ్చారు. రైల్వే బోర్డు ఛైర్మన్‌గా ఉన్న అనిల్ కుమార్ లహోటి పదవీకాలం ముగియడంతో ఆ స్థానాన్ని రైల్వే బోర్డు సభ్యురాలిగా ఉన్న జయా వర్మ సిన్హాతో భర్తీ చేశారు. రైల్వే బోర్డు చరిత్రలో ఓ మహిళ చైర్‌పర్సన్‌గా, సీఈవోగా నియమితులు కావడం దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ఈమె రైల్వేలో ట్రాఫిక్ విభాగంలో అధికారిణి. ప్రస్తుతం రైల్వే బోర్డులో కార్యకలాపాలు - వ్యాపార ఆభివృద్ధి విభాగం సభ్యురాలిగా ఉన్నారు. ఆమెను రైల్వే బోర్డు కొత్ చీఫ్‌గా నియమిస్తున్నట్టు రైల్వేశాఖ విడుదల చేసి ఓ ప్రకటనలో తెలిపింది. ఆమె నియామకానికి కేంద్ర నియామకాల కమిటీ కూడా ఆమోదం తెలిపింది. ఈమె వచ్చే యేడాది ఆగస్టు 31వ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

470 కేజీల వెండి గొలుసులతో పవన్ కళ్యాణ్ చిత్తరువు