Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాకు వందే భారత్ రైలును కేటాయించిన కేంద్రం

Advertiesment
Bharat Express
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్ళలో ఒకదాన్ని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది. ఇది దేశంలో నడుపనున్న ఆరో రైలు కావడం గమనార్హం. అయితే, ఈ రైలును ఏ మార్గంలో నడపాలన్న అంశంపై అధికారులు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. 
 
అత్యాధునిక సాంకేతికత, అంత్యత వేగంగా ప్రయాణించే ఈ రైలును సికింద్రాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించినట్టు రైల్వే బోర్డు తెలిపింది. ఈ రైలు గరిష్టంగా 180 కిలోటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. 
 
అయితే, ఈ రైలులో బెర్తులు ఉండవు. సీటింగ్ మాత్రమే ఉంటుంది. దీంతో ఉదయం పూట బయలుదేరి, సాయంత్రానికి గమ్యస్థానం చేరుకునేలా ఈ రైలు ఉంటుంది. అందుకు అనువుగా ఉండే రూటును ఖరారు చేయనున్నారు. 
 
ప్రస్తుతానికి ఈ రైలును నడిపే మార్గాన్ని ఇంకా ఖరారు చేయలేదు. అయితే, సికింద్రాబాద్ నుంచి తిరుపతి లేదా బెంగుళూరు లేదా విశాఖపట్టణం లేదా ముంబై మార్గాలలో నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా ప్రయాణకుల డిమాండ్ ఉన్న ప్రాంతాల మధ్యే ఈ రైలును నడుపనున్నారు. 
 
మరోవైపు చెన్నై నుంచి బెంగుళూరు మీదుగా మైసూరు వరకు వందే భారత్ రైలు నడుపనున్నారు. ఇది రేపటి నుంచి పట్టాలెక్కనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణాకు కేటాయించిన ఆరో మెట్రో రైల్ ట్రాఫిక్, ప్రయాణికుల డిమాండ్ వంటివాటిపై రైల్వే బోర్డు అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీకి శుభవార్త చెప్పిన కేంద్రం .. రెవెన్యూ లోటు కింద రూ.879 కోట్లు