Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లిథియం బ్యాటరీల కోసం ఏఐఎస్ 156 సర్టిఫికేషన్‌ ప్రమాణాలు కలిగిన ప్యూర్‌ వాహనాలు

Epluto
, గురువారం, 6 అక్టోబరు 2022 (23:45 IST)
తమ అన్ని సీఎంవీఆర్‌ ప్రమాణాలు కలిగిన మోడల్స్‌ను AIS 156 పరీక్షా ప్రమాణాలు కలిగి ఉన్నాయని కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవే మంత్రిత్వ శాఖ (మార్త్‌) విడుదల చేసిన SO No 5419(E) లో నిర్ధారించినట్లుగా ప్యూర్‌ ఈవీ వెల్లడించింది. ఈ దిగువ పేర్కొనబడిన మోడల్స్‌ AIS 156 ప్రమాణాల కింద హోమోలోగేషన్‌ ఏజెన్సీ నిర్ధారించినట్లుగా కంపెనీ వెల్లడించింది:

 
ePluto 7G వాహన మోడల్‌ యొక్క బ్యాటరీ సామర్థ్యం 60V, 40AH. అలాగే ETRANCE NEOకి 60V, 40AH సామర్ద్యం, ఇంకా eTryst 350కి 72V, 47.5 AH సామర్థ్యం కలిగి వుంటాయి. ఈ కంపెనీ తెలంగాణాలో ఒక లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ ఫ్యాక్టరీని ఏర్పాటుచేసింది. దీనిలో వాహన, బ్యాటరీ తయారీ విభాగాలు ఉన్నాయి. దీనిలో ప్రస్తుతం 700 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ కంపెనీ తమ ఫ్యాక్టరీని రెండు లక్షల చదరపు అడుగులకు విస్తరించడంతో పాటుగా తమ వార్షిక వాహన ఉత్పత్తి సామర్థ్యంను 1,20,000 యూనిట్లకు పెంచడానికి ప్రణాళిక చేసింది. ఈ సంస్థ వార్షిక బ్యాటరీ ఉత్పత్తి సామర్థ్యం 0.5గిగా వాట్‌ హవర్‌.  ఇది 2023 ఆర్ధిక సంవత్సరాంతానికి సిద్ధం కావడంతో పాటుగా ఉద్యోగుల సంఖ్య 1000కు పైగా చేరనుంది.
 
ఈ కంపెనీ ఇటీవలనే తమ మొట్టమొదటి పెర్‌ఫార్మెన్స్‌ వాహన మోటర్‌సైకిల్‌ ETRYST 350ను విడుదల చేసింది. వృద్ధి చెందుతున్న భారతీయ విద్యుత్‌ వాహన రంగంలో అత్యధిక వాటాకు ఇది ప్రాతినిధ్యం వహించనుంది. ప్యూర్‌ ఈవీ దేశ వ్యాప్తంగా 50వేలకు పైగా వాహనాల డెలివరీలను తమ విస్తృత శ్రేణి డీలర్‌షిప్‌ నెట్‌వర్క్స్‌ ద్వారా డెలివరీ చేసింది.

 
అమ్మకం తరువాత సేవల పరంగా కంపెనీ సామర్ధ్యం గురించి రోహిత్‌ వదేరా, సీఈఓ-ప్యూర్‌ ఈవీ మాట్లాడుతూ, ‘‘ఈ కంపెనీ ఇప్పుడు కృత్రిమ మేథస్సు (ఏఐ) వ్యవస్థ బ్యాట్రిక్స్‌ ఫారాడే (BaTRics Faraday)ను దేశవ్యాప్తంగా తమ డీలర్‌షిప్‌లలో అమలు చేస్తోంది. దీనిద్వారా విద్యుత్‌ ద్విచక్రవాహనాలలో లిథియం అయాన్‌ బ్యాటరీలో సమస్యలను కనుగొని, మరమ్మత్తులు చేయడం జరుగుతుంది. ఇది బ్యాటరీ సర్వీసింగ్‌ కోసం ప్రతిష్టాత్మక ప్రయోజనం అందించనుంది. అవసరమైన యంత్రసామాగ్రితో అత్యాధునిక వర్క్‌షాప్‌లను పరిశ్రమల వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, మా వినియోగదారులకు అత్యుత్తమ అమ్మకం తరువాత సేవల అనుభవాలను అందించనున్నామనే భరోసా అందిస్తున్నాము. తద్వారా మొత్తం వాహన జీవిత కాలంలో ఆరోగ్యవంతమైన మద్దతు వ్యవస్థను అందించగలము’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిద్ధరామయ్యను పరుగులు పెట్టించిన రాహుల్ గాంధీ