కోవిడ్-19 పరిస్థితులు భారతదేశంలో ఊహాతీత సవాళ్లకు కారణమయ్యాయి. అంతర్జాతీయంగా కూడా ఈ మహమ్మారి ప్రభావం కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరీముఖ్యంగా మన సమాజంలో అణగారిన వర్గాలైనటువంటి వలస కార్మికులపై ఇది తీవ్రంగా ప్రభావం చూపింది. వలస కార్మికులకు సహాయపడటంలో భాగంగా ప్లాటినమ్ గిల్డ్ ఇండియా ఇప్పుడు ఆక్స్‌ఫామ్ ఇండియాతో భాగస్వామ్యం చేసుకుని ‘ప్లాటినమ్ సీజన్ ఆఫ్ హోప్’ కార్యక్రమం ఆవిష్కరించింది.
ఈ కార్యక్రమం ద్వారా 4500 కుటుంబాలలోని దాదాపు 22,500 మంది వ్యక్తులపై రాబోయే మూడు నెలల కాలంలో ప్రభావం చూపనున్నారు. ఈ ఉపశమన ప్యాకేజీలలో రోజువారీ భోజనాలు/నిత్యావసరాలు, శానిటరీ కిట్స్‌తో పాటుగా అత్యవసర ఆహారేతర సరఫరా కోసం ప్రత్యక్ష బదిలీ ప్రయోజనం వంటివి ఉంటాయి. మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితం కావడంతో పాటుగా ప్రకృతి విపత్తుల చేత తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాలైనటువంటి పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఒడిషా, బీహార్‌లలోని జీవితాలను ఈ కార్యక్రమం ద్వారా స్పృశించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆశలను తిరిగి రేకిత్తించడాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
ఈ కార్యక్రమం గురించి శ్రీమతి వైశాలీ బెనర్జీ, మేనేజింగ్ డైరెక్టర్, పీజీఐ ఇండియా మాట్లాడుతూ, ‘‘పీజీఐ వద్ద, సమాజానికి తిరిగి ఇవ్వాలని మేము కోరుకుంటుంటాం మరియు మన పర్యావరణ వ్యవస్థను ఏకీకృతం చేయడంలో ఆశాకిరణంగా ఉండే ప్రతి ఒక్కరికీ – వలస కార్మికుల సహా ఆశను రేకిత్తించాలనీ కోరుకుంటున్నాం. ఆక్స్‌ఫామ్ ఇండియాతో ఈ కార్యక్రమం కోసం భాగస్వామ్యం చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నాం.
వాస్తవానికి ఈ కారణం మరియు ప్రయోజనం మా హృదయంలో ఉంది. దీనినే మేము సీజన్ ఆఫ్ హోప్ అని పిలుస్తున్నాం. ఈ మహమ్మారి మాకు కృతజ్ఞతతో ఉండటం నేర్పడటమే కాదు, ప్రశంసల యొక్క నూతనభావాన్నీ తీసుకువచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా, మేము కృతజ్ఞతా భావాన్ని వ్యాప్తి చేయడమే లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా ఆశావాహ భావనను రేకిత్తించే విలువలు మరియు భావోద్వేగాలను తీసుకురానున్నాం’’ అని అన్నారు.
‘‘ప్లాటినమ్ గిల్డ్ ఇంటర్నేషనల్ (పీజీఐ) ఇండియాతో భాగస్వామ్యాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఆక్స్‌ఫామ్ ఇండియా వద్ద మేము మన సమాజంలో పలు వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాము వారి వృద్ధి కోసం నిరంతరం నిమగ్నమై ఉన్నాము. ఈ సంవత్సరం, వలసకార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులు కోవిడ్-19 మహమ్మారి కారణంగా తీవ్ర ప్రభావం బారిన పడిన కమ్యూనిటీలలో ఒకరిగా నిలిచారు. పీజీఐ ఇండియాతో కలిసి, మేము సమాజంపై సానుకూలంగా ప్రభావం చూపడంతో పాటుగా అత్యుత్తమ రేపటి కోసం వారు కలలు కనేందుకు సహాయపడాలనుకుంటున్నాం’’ అని అమితాబ్ బెహార్, ఆక్స్‌ఫామ్ ఇండియా సీఈవో అన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వలస కార్మికులు. బహుశా క్రూరమైన ప్రభావం వారిపై పడింది. వారి జీవితాలను వృద్ధి చేయాలనే దిశగా వేసిన చిన్న అడుగు. ప్లాటినమ్ సీజన్ ఆఫ్ హోప్ ఇప్పుడు రిటైల్ యాక్టివేషన్‌లో సైతం విస్తరించడంతో పాటుగా 1200కు పైగా ప్లాటినమ్ గిల్డ్ ఇండియా యొక్క రిటైల్ భాగస్వాములతో తమ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లనుంది.
విజయవంతంగా అన్‌లాక్ చేయడంతో పాటుగా నాల్గవ త్రైమాసంలో పండుగలు మరియు వివాహ వేడుకల సీజన్ ప్రారంభం కావడంతో వాణిజ్య మరియు వినియోగదారుల సెంటిమెంట్ ప్లాటినమ్ పట్ల సానుకూలంగా ఉండనుంది. అందువల్ల, సీజన్ ఆఫ్ హోప్ ఈ సానుకూల ధోరణి నిర్మించేందుకు ఉత్ర్పేరకంగా నిలువనుంది.
సీజన్ ఆఫ్ హోప్ అనేది వినియోగదారుల మరియు ట్రేడ్ మార్కెటింగ్ కార్యక్రమం. సామాజిక మరియు డిజిటల్ వేదికలపై ఇది దృష్టి కేంద్రీకరించడంతో పాటుగా ఈ–కామర్స్‌లో చురుకైన భాగస్వామ్యం కోరుకుంటుంది. ప్లాటినమ్ గిల్డ్ ఇండియా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ కార్యక్రమాలను మా బ్రాండెడ్ విభాగాలు మూడింటిలోనూ చేస్తుంది. నూతన సేకరణలు, విస్తృత శ్రేణి ధరల వద్ద బోర్డును శక్తివంతం చేసేందుకు ఇది ప్రయత్నం.