ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఎఫెక్ట్‌తో పెట్రోల్ ధరలు పెరుగనున్నాయి. ఈనెల 10 తర్వాత ఏ క్షణమైనా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్ల సవరణను చేపట్టవచ్చని జేపీ మోర్గాన్ సంస్థ అంచనా వేసింది.
లీటర్ పెట్రోల్ రూ.10-15 లోపు, లీటర్ డీజిల్ రూ.8-10 వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని.. వాహనదారులు దీనికి సిద్ధంగా ఉండాలని జేపీ మోర్గాన్ సర్వే సంస్థ సూచించింది. ఈనెల 7న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. ఆ తర్వాత సామాన్యులపై పెరిగే పెట్రోల్ ధరలు షాకివ్వనున్నాయి.
మరోవైపు చమురు కంపెనీలు ఇప్పటికే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను కంపెనీలు పెంచాయని గుర్తుచేసింది. ఎన్నికలు ముగిసిన తర్వాత గృహ వినియోగ సిలిండర్ ధరలను కూడా పెంచే అవకాశాలున్నాయని తెలిపింది.