త్వరలో రూపుదాల్చనున్న మైక్రోచిప్ ఈ-పాస్ పోర్టుల ప్రక్రియ
నకిలీ నోట్లకు చెక్ పెట్టే దిశగా పెద్ద నోట్లు రద్దు అయిన నేపథ్యంలో.. నకిలీ పాస్ పోర్టులకు ఇకపై గండిపడనుంది. ఇందులో భాగంగా త్వరలో ఈ-పాస్ పోర్టుల ప్రక్రియ రూపుదాల్చనుంది. ఇకపై రాబోయే ఈ-పాస్ పోర్టుల్లో ఓ
నకిలీ నోట్లకు చెక్ పెట్టే దిశగా పెద్ద నోట్లు రద్దు అయిన నేపథ్యంలో.. నకిలీ పాస్ పోర్టులకు ఇకపై గండిపడనుంది. ఇందులో భాగంగా త్వరలో ఈ-పాస్ పోర్టుల ప్రక్రియ రూపుదాల్చనుంది. ఇకపై రాబోయే ఈ-పాస్ పోర్టుల్లో ఓ ఎలక్ట్రానిక్ చిప్ అమర్చి ఉండడంతో పాటు మెరుగైన సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయని గత జులైలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వీకే సింగ్ దీనికి సంబంధించిన స్పష్టమైన ప్రకటన చేశారు.
నకిలీ పాస్ పోర్టులకు చెక్ పెట్టేందుకు గాను.. కొత్తగా తీసుకొచ్చే ఈ పాస్ పోర్టుల్లో బయో మెట్రిక్ వివరాలను పొందుపరచనున్నట్టు తెలిపారు. పాస్ పోర్టులకు సంబంధించి టెండర్ ప్రక్రియతో పాటు ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్‌ను వీటిల్లో అమర్చేందుకు రంగం సిద్ధమవుతుంది. పాస్ పోర్టుకు సంబంధించిన పూర్తి వివరాలను చిప్ ద్వారా ఈ-పాస్ పోర్టుల్లో పొందుపరుస్తారు.