ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎంటి )-హైదరాబాద్, తమ అభ్యుదయ్ 2024- మేనేజ్‌మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ (2024-26 బ్యాచ్) ప్రారంభించింది. ఈ వేడుకకు హాజరైన గౌరవనీయ అతిథులులో డా. శాతకర్ణి మక్కపాటి, సీఈఓ, క్యూరా టెక్-డైరెక్టర్, అరబిందో ఫార్మా, డాక్టర్ రవి ప్రకాష్ మాథుర్, వైస్ ప్రెసిడెంట్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్- డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్‌లోని లాజిస్టిక్స్ గ్లోబల్ హెడ్, శ్రీ స్వస్తిక్ బిహానీ, ఎండి మరియు కంట్రీ హెడ్, జీహెచ్ఎక్స్ ఇండియా, శ్రీ కెవి మహిధర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హెడ్, సిఐఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్ వున్నారు.
ఈ సంవత్సరం ప్రధాన ఆకర్షణగా రెండు ప్రతిష్టాత్మక కోర్సుల ప్రారంభం వుంది. అవి సిఐఐ -ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్ సహకారంతో లాజిస్టిక్స్ & సప్లై చైన్ మేనేజ్‌మెంట్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ సహకారంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పిజిడిఎం ఇండస్ట్రీ ట్రాక్ ప్రోగ్రామ్‌ల ఆవశ్యకతను వెల్లడించిన, ఐఎంటి హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ శ్రీహర్ష రెడ్డి మాట్లాడుతూ, ఐఎంటి హైదరాబాద్ ప్రయాణంలో ఇది కొత్త శకమన్నారు. తాము పరిశ్రమ అవసరాలను తీర్చడానికి మరింతగా పరిశ్రమ సహకారంతో ముందుకు సాగుతున్నామన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ శాతకర్ణి మక్కపాటి మాట్లాడుతూ, బి-స్కూల్‌లో రెండు సంవత్సరాల ప్రయాణంలో విద్యార్థులు అనుసరించాల్సిన ఆరు ముఖ్యమైన అంశాల సర్క్యూట్‌ను వివరించారు. శ్రీ స్వస్తిక్ బిహానీ మాట్లాడుతూ, అకడమిక్ లెర్నింగ్‌ను కేవలం రోట్ మెమోరైజేషన్ నుండి సమాజానికి సానుకూలంగా దోహదపడే ఆచరణాత్మక అప్లికేషన్‌గా మార్చాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
వ్యాపారంలో విజయం సాధించే పద్ధతులను డాక్టర్ రవి ప్రకాష్ మాథుర్ వెల్లడించారు. వ్యాపారంలో విజయం సాంకేతికతపై ఆధార పడటం, ప్రక్రియలను మార్చడం, సమాచారాన్ని సమర్ధవంతంగా నిర్వహించడంపై ఆధారపడి ఉంటుందని వివరించారు. గత దశాబ్దంలో లాజిస్టిక్స్‌లో ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో, సాంప్రదాయ రవాణాకు మించి విస్తరించిన ముఖ్యమైన పరివర్తనలను శ్రీ మహీధర్ వెల్లడించారు.