Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రత్నగిరి ఎస్టేట్ కాఫీలతో ప్రత్యేకమైన కాఫీ కప్పింగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఫస్ట్ క్రాక్ స్పెషాలిటీ రోస్టర్స్

coffee

ఐవీఆర్

, గురువారం, 20 జూన్ 2024 (18:48 IST)
కాఫీ ప్రియులు, సాగుదారులు, కేఫ్ యజమానులు, స్పెషాలిటీ కాఫీ కమ్యూనిటీకి చెందిన నిపుణులను ఒకచోట చేర్చి, హైదరాబాద్‌లోని ద కోరమ్‌లో ఫస్ట్ క్రాక్ స్పెషాలిటీ రోస్టర్స్ "క్రాఫ్టింగ్ కాఫీ కల్చర్" కార్యక్రమంను నిర్వహించింది. ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో రత్నగిరి ఎస్టేట్ నుండి తీసుకువచ్చిన అత్యుత్తమ స్పెషాలిటీ కాఫీలను సైతం ప్రదర్శించారు. దీనితో పాటుగా రత్నగిరి ఇంటర్నేషనల్ మేనేజింగ్ పార్టనర్ శ్రీ అశోక్ పాత్రేతో చర్చా కార్యక్రమం నిర్వహించారు.
 
రత్నగిరి ఎస్టేట్ నుండి ప్రత్యేకమైన కాఫీలను అందించటం ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమానికి హాజరైనవారు కాఫీ కప్పింగ్ ప్రక్రియను ఆస్వాదించారు, ఇది కాఫీ యొక్క లక్షణాలను అంచనా వేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రమాణీకరించబడిన పద్ధతి. రత్నగిరి ఎస్టేట్ నుండి 86-92 మధ్య రేట్ చేయబడిన ప్రీమియం కాఫీలు ఇక్కడ కప్పింగ్ చేయబడ్డాయి. సాధారణంగా దక్షిణ అమెరికా, ఇథియోపియన్ రకాల్లో కనిపించే అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉండే భారతీయ కాఫీలను రుచి చూసే అరుదైన అవకాశాన్ని ఇది అందించింది. 
 
శ్రీ అశోక్ పాత్రే మాట్లాడుతూ హై-గ్రేడ్ స్పెషాలిటీ ఇండియన్ కాఫీని పండించడంలోని సవాళ్లు, కాఫీ ప్రాముఖ్యతను వెల్లడించారు. భారతీయ కాఫీ మార్కెట్‌లు ఎలా అభివృద్ధి చెందాయో చెబుతూ రత్నగిరి ఎస్టేట్‌లో వారి కాఫీలు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా చేసే ప్రాసెసింగ్ పద్ధతులను గురించి చెప్పారు. ఫస్ట్ క్రాక్ స్పెషాలిటీ రోస్టర్స్ ద్వారా కొత్త కాఫీ ఉత్పత్తుల ప్రదర్శనతో కార్యక్రమం ముగిసింది. 
 
ఫస్ట్ క్రాక్ స్పెషాలిటీ రోస్టర్స్ వ్యవస్థాపకురాలు చాందిని ఎస్‌ఆర్‌కె మాట్లాడుతూ, "ఫస్ట్ క్రాక్‌లో మా లక్ష్యం కాఫీ రైతులు, వినియోగదారుల మధ్య అంతరాన్ని తగ్గించడం, ప్రతి కప్పు పొలం నుండి కప్పు వరకు దాని ప్రయాణం వెనుక కథను చెబుతుందని నిర్ధారిస్తుంది. నేటి కార్యక్రమం భారతీయ ప్రత్యేక కాఫీ యొక్క అద్భుతమైన సామర్థ్యానికి నిదర్శనం" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిజైన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024లో అపూర్వ విజయం సొంతం చేసుకున్న బే విండో