Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈపీఎఫ్ చందాదారులకు ఓ శుభవార్త.. వడ్డీరేటు పెంపు

Advertiesment
Six crore
, మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (18:24 IST)
ఈపీఎఫ్ చందాదారలకు ఓ శుభవార్త. ఆర్థిక శాఖ జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్) తదితర నిధులపై గతంలో 8.0 శాతంగా ఉన్న వడ్డీరేటును సెప్టెంబర్ 30 నాటికి 7.99 శాతానికి తగ్గించిన సంగతి విదితమే.

అయితే 2018-19 సంవత్సరానికి గాను ప్రస్తుతమున్న 8.55శాతం వడ్డీకి బదులు 8.65 శాతాన్ని పొందనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ చెప్పారు. 
 
ఆరు కోట్లకు పైగా చందాదారులకు మేలు కలిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కార్మిక, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య వడ్డీరేటుపై ఉన్న భిన్నాభిప్రాయాలను తొలగించుకొనేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిపిన చర్చల్లో 8.65 శాతం వడ్డీ రేటు చెల్లించినా సంస్థ వద్ద సరిపడా మిగులు ఉందని వివరించారు. దీంతో ఈపీఎఫ్ పెంపుదలకు మార్గం సుగమమైనట్లు అధికారి చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏరియా 51: అమెరికాలో రెండు పట్టణాలను గడగడలాడిస్తున్న 'ఏలియన్స్ జోక్'..