Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆన్‌లైన్ సేల్స్... భారీ డిస్కౌంట్లకు తెర, ఎందుకు?

Advertiesment
ఆన్‌లైన్ సేల్స్... భారీ డిస్కౌంట్లకు తెర, ఎందుకు?
, శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (14:53 IST)
ఎవరైనా స్మార్ట్‌ఫోన్ నుండి ఇంటికి కావలసిన వస్తువుల వరకు ఏవి కొనాలన్నా బయట దుకాణాలకు వెళ్లడం మానేసి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి విదేశీ ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లను వెదుక్కోవడం అలవాటైపోయిన సగటు పౌరుడికి ఎదురుదెబ్బ తగిలింది. ఇటువంటి కంపెనీలు అందజేసే భారీ డిస్కౌంట్‌ ఆఫర్లకు ఇక తెరపడనుంది. 
 
అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి దిగ్గజ ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు అందించే భారీ డిస్కౌంట్ల కారణంగా దేశంలోని ఆఫ్‌లైన్‌ చిల్లర వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారనీ, ఈ వెబ్‌సైట్లకు ఎక్కువగా నిధులు ఉండడంతో నష్టాలకు వెరవకుండా ఆయా వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందజేస్తున్నాయనీ., కొత్త ఫోన్లు లేదా ఇతర ఉత్పత్తుల విషయంలో ఆ ఉత్పత్తులను తమ వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే అమ్ముడయ్యేలా, ఆయా కంపెనీలతో ఎక్స్‌క్లూజివ్‌ ఒప్పందాలు చేసుకుంటున్నాయి.
 
దీంతో తమ వ్యాపారం దెబ్బతింటోందని రిటైల్‌ వ్యాపారులు ఫిర్యాదు చేసిన మేరకు ప్రభుత్వం గత ఏడాది డిసెంబరు 26వ తేదీన ఈ విధమైన ఉత్తర్వులను జారీ చేసిన నేపథ్యంలో ఈ వెబ్‌సైట్లు ఇక తమకు ఈక్విటీ వాటా ఉన్న కంపెనీల ఉత్పత్తుల అమ్మకాలు, వాటి మొత్తం అమ్మకాల్లో 25 శాతం మించకూడదనే నిబంధన అమలులోకి వచ్చింది. అలాగే కొన్ని కంపెనీలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకొని ఆ కంపెనీల ఉత్పత్తులను తమ వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే అమ్మడాన్ని కూడా ప్రభుత్వం నిషేధించింది. 
 
ఈ నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం గత సంవత్సరం డిసెంబరు 26వ తేదీనే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువుని మరింత పెంచాలన్న అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల విజ్ఞప్తిని ప్రభుత్వం తాజాగా గురువారంనాడు తిరస్కరించింది. దీంతో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఇ-కామర్స్‌ దిగ్గజాలు ఆఫర్‌ చేసే భారీ డిస్కౌంట్‌ విక్రయాలకు తెరపడుతుందని భావిస్తున్నారు. ఈ నిబంధనలు శనివారం నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనలతో ఈ ఇ-కామర్స్‌ దిగ్గజ కంపెనీల వెబ్‌సైట్లలో అమ్మకానికి పెట్టే సొంత ఉత్పత్తుల సంఖ్య భారీగా తగ్గుతుందని భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైలులో ప్రయాణం... వాటర్ క్యాన్‌లో లక్షల సొమ్ము..