Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేడ్ ఇన్ ఇండియా: చైనా వన్ ప్లస్ 5 తయారీ ఎక్కడో తెలుసా? నోయిడాలో!

చైనాకు చెందిన ఈ ఫోన్ తయారీ ఎక్కడ జరుగుతుందో తెలుసా..? మనదేశంలోనే. అదీ, నోయిడాలో. నోయిడాలో ఉన్న ఒప్పో మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో వన్‌ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ల తయారీ జరుగుతోంది. దీన్నిబట

Advertiesment
మేడ్ ఇన్ ఇండియా: చైనా వన్ ప్లస్ 5 తయారీ ఎక్కడో తెలుసా? నోయిడాలో!
, బుధవారం, 28 జూన్ 2017 (16:43 IST)
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ వన్ ప్లస్ నుంచి కొత్త ఫ్లాష్‌షిప్ స్మార్ట్ ఫోన్ ఈ నెల 22న మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ అయిన వన్ ప్లస్ 5ను ప్రస్తుతం యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ-కామర్స్ సైట్లు సేల్స్ మొదలెట్టాయి. ఈ క్రమంలో వన్ ప్లస్ ఫోన్లను అమెజాన్ సైట్‌లో, వన్ ప్లస్ స్టోర్స్‌లో విక్రయిస్తున్నట్లు వన్ ప్లస్ వెల్లడించింది.
 
ఈ ఫోన్ 6జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.32,999 ఉండగా, 8 జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.37,999 గా ఉంది. చైనాకు చెందిన ఈ ఫోన్ తయారీ ఎక్కడ జరుగుతుందో తెలుసా..? మనదేశంలోనే. అదీ, నోయిడాలో. నోయిడాలో ఉన్న ఒప్పో మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో వన్‌ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ల తయారీ జరుగుతోంది. దీన్నిబట్టి ఒప్పోకు వన్‌ప్లస్ 5 తయారీ కాంట్రాక్ట్‌ను వన్‌ప్లస్ అప్పగించినట్టు స్పష్టంగా తెలిసిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెల్‌ఫోన్ ఛార్జ్ కోసం ఇంటికొచ్చి రేప్ చేయబోయాడు.. బిగ్గరగా కేకలు పెట్టడంతో నిప్పంటించాడు..