Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.39,999 ధరతో ఓకాయ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

Advertiesment
రూ.39,999 ధరతో ఓకాయ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌
, సోమవారం, 1 నవంబరు 2021 (12:25 IST)
ప్రముఖ ఓకాయా పవర్‌ గ్రూప్‌ ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ కూడా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. తక్కువ ధరకే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను అందిస్తోంది. కేవలం 39,999 రూపాయల ధరతో ఓకాయ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్లో విడుదలైంది. ఈ స్కూటర్‌కు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఓకాయా కంపెనీ దేశంలోని 18 రాష్ట్రాల్లో ఇప్పటికే 165 మంది డీలర్లను నియమించుకుంది.
 
ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్‌లో ద్విచక్ర వాహనాల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసిన ఈ సంస్థ… హర్యానాలోను, రాజస్థాన్‌లోని నీమ్రానాలో మరో మూడు ప్లాంట్లను 2023-25 నాటికి ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్కూటర్‌ను అత్యాధునిక టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొంది. 
 
ఇటీవల నవరాత్రి పండుగ సందర్భంగా ఈ స్కూటర్‌ను ప్రారంభించారు. కాగా వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తుందని ఓకాయా చెబుతోంది. దీంతో భారత్‌లో పూర్తి స్థాయిలో విస్తరించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపింది. భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా ప్రత్యేకంగా రెండు అత్యాధునిక ఆర్ అండ్ డి సెంటర్లు నెలకొల్పనున్నట్లు సంస్థ తెలిపింది. 
 
కాగా ఈ స్కూటర్‌ను నడిపేందుకు ఎటువంటి లైసెన్సు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఓకాయా పవర్ గ్రూప్ 4 దశాబ్దాలుగా భారతదేశంలో బ్యాటరీ తయారీ రంగంలో నమ్మకానికి, నాణ్యతకు మంచి పేరుగా ఉంది. అలాగే దేశంలో బ్యాటరీ తయారీ పరిశ్రమలో అగ్రగామిగా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల్లూరులో దంతవైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి