Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

23 కోట్ల పెట్టుబడిదారుల మైలురాయిని అధిగమించిన NSE

Advertiesment
NSE

ఐవీఆర్

, గురువారం, 31 జులై 2025 (22:09 IST)
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా(NSE) జూలై 2025లో మరో కీలక మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక ట్రేడింగ్ ఖాతాల సంఖ్య 23 కోట్లు (230 మిలియన్లు) దాటింది. విశేషమేనంటే, ఇది ఏప్రిల్ 2025లో 22 కోట్ల మార్కును దాటిన కేవలం మూడు నెలల్లోనే సాధించిన పురోగతి. అదే సమయంలో, ప్రత్యేక రిజిస్టర్డ్ పెట్టుబడిదారుల సంఖ్య 11.8 కోట్లు(జూలై 28,2025 నాటికి)గా ఉంది.
 
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) తాజా గణాంకాల ప్రకారం, ఒకే పెట్టుబడిదారుడు బహుళ బ్రోకర్ల వద్ద ఖాతాలను కలిగి ఉండగలుగుతున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా బహుళ క్లయింట్ కోడ్లు నమోదయ్యాయి. ప్రాంతీయ పంపిణీ పరంగా, మహారాష్ట్ర దాదాపు 4 కోట్ల ట్రేడింగ్ ఖాతాలతో (17% వాటా) అగ్రస్థానంలో నిలిచింది. దీని తరువాత ఉత్తర ప్రదేశ్- 2.5 కోట్లు (11% వాటా), గుజరాత్- 2 కోట్లకు పైగా(9% వాటా), పశ్చిమ బెంగాల్, రాజస్థాన్-ఒక్కొక్కటి 1.3 కోట్లకు పైగా (6% వాటా) ఉన్నాయి. సమిష్టంగా చూస్తే, ఈ ఐదు రాష్ట్రాలు దేశంలోని మొత్తం ట్రేడింగ్ ఖాతాల్లో సుమారు సగం వాటాను కలిగి ఉన్నాయి. అదేవిధంగా, మొదటి పది రాష్ట్రాలు కలిపి మొత్తం ఖాతాల్లో 75% వరకు వాటాను కలిగినట్లు NSE వెల్లడించింది.
 
భారతీయ స్టాక్ మార్కెట్లలో పాల్గొనేవారిలో యువత, మొదటిసారి పెట్టుబడిదారుల శాతం వేగంగా పెరుగుతోంది. ఈ కొత్త తరాన్ని ఫైనాన్షియల్ జ్ఞానంలో ముందుండేలా చేయడానికి, సెబీ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మార్కెట్ రిస్క్ మేనేజ్మెంట్, మోసాల నివారణ, దీర్ఘకాలిక పెట్టుబడి సూత్రాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలను ప్రారంభించాయి. గత ఐదేళ్లలో NSE ఈ రంగంలో తన ప్రయత్నాలను గణనీయంగా విస్తరించింది. NSE నిర్వహించిన పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాల(IAP) సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది-FY20లో 3,504 నుండి FY25 లో 14,679 కి పెరిగింది, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 8 లక్షలకు పైగా పార్టిసిపెంట్లకు చేరుకుంది. NSE యొక్క ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ (IPF) జూన్ 30,2025 నాటికి సంవత్సరానికి 22% పెరిగి 2,573 కోట్ల రూపాయలకు చేరుకుంది.
 
భారతీయ ఈక్విటీ మార్కెట్లు గణనీయమైన సంపద సృష్టికి వేదికగా మారాయి. ఈ క్రమంలో, పెట్టుబడిదారుల ఆర్థిక సాక్షరత కీలకంగా మారుతోంది. గత ఐదేళ్లలో, నిఫ్టీ 50, నిఫ్టీ 500 వరుసగా 17% మరియు 20% కంటే ఎక్కువ వార్షిక రాబడిని అందించాయి. ఈ నేపథ్యంలో, రిటైల్ పెట్టుబడిదారుల వృద్ధికు పునాది వేసిన ప్రధాన అంశాలు: డిజిటలైజేషన్, ఫిన్‌టెక్ విస్తరణ, వృద్ధి చెందుతున్న మధ్యతరగతి మరియు కేంద్ర ప్రభుత్వంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాయకత్వంలో వినూత్న విధానాలు, మౌలిక సదుపాయాల పెరుగుదల, మరియు పెట్టుబడులపట్ల ప్రోత్సాహక వాతావరణం ద్వారా ముందుకు సాగుతుంది.
 
మిస్టర్. శ్రీరామ్ కృష్ణన్, చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్, NSE ఇలా అన్నారు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) తాజాగా మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. ఏప్రిల్ 2025లో 22 కోట్ల (220 మిలియన్) ట్రేడింగ్ ఖాతాల గరిష్ఠాన్ని చేరిన తరువాత కేవలం మూడు నెలల్లోనే కోటి కొత్త ఖాతాలు జతచేయడం గమనార్హం. ఈ వేగవంతమైన వృద్ధి కొన్ని ముఖ్యాంశాలను సూచిస్తుంది. భారత మూలధన మార్కెట్ల పట్ల పెట్టుబడిదారుల బలమైన నమ్మకాన్ని, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య స్థిరమైన పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను, డిజిటలైజేషన్, మొబైల్-ఆధారిత ట్రేడింగ్ ప్లాట్‌ఫారాల అధిక స్వీకరణ ద్వారా శక్తిని పొందింది.
 
ప్రత్యేకంగా చిన్న పట్టణాలు, పాక్షిక నగర కేంద్రీకృత ప్రాంతాల్లో పెట్టుబడి ప్రవేశాన్ని సులభతరం చేయడంలో ఈ పరిణామాలు కీలకంగా మారాయి. వీటితో పాటు, ఇది లక్ష్యిత విధానాలు మరియు సంస్థాగత ప్రయత్నాల ప్రభావాన్ని కూడా స్పష్టంగా చూపిస్తుంది. సరళమైన ఆన్బోర్డింగ్ ప్రక్రియల నుండి ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాల వరకు విస్తృత మార్కెట్ భాగస్వామ్యతను ప్రోత్సహించడంలో వీటి ప్రభావం చూపుతుంది. ఈక్విటీలు, ETFలు, REITలు, InvITలు మరియు రుణ పరికరాల్లో మరింత మంది పెట్టుబడులు పెట్టడం వల్ల, ఈ మైలురాయి సాంకేతికత సాయంతో పెట్టుబడులను మరింత విభిన్నంగా, ప్రజలకు సులభంగా లభించేలా తీర్చిదిద్దే అవకాశాలను కల్పిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం