Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశ వ్యాప్తంగా వారానికి 90 గంటలా? కేంద్రం ఆన్సర్ ఏంటి?

Advertiesment
it company

ఠాగూర్

, బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (12:27 IST)
దేశ వ్యాప్తంగా వారానికి 70 లేదా 90 గంటల పాటు పనిదినాలు ఉండాలనే చర్చ ఇటీవల మొదలైంది. దీన్ని అనేకమంది పారిశ్రామికవేత్తలు తోసిపుచ్చారు. దీనిపై కేంద్రం కూడా క్లారిటీ ఇచ్చింది. లోక్‌సభలో కేంద్ర ఉపాధి కల్పల కార్మిక శాఖ సహాయ సహాయ మంత్రి శోభా కరండ్లాజే లిఖితపూర్వక సమాధానమిచ్చింది. 
 
ఉద్యోగుల పని గంటల పెంపు అంశంపై పలువురు కార్పొరేట్ దిగ్గజాలు చేస్తున్న వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చింది. పని గంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది.
 
కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన సహాయ మంత్రి శోభా కరండ్లాజే ఈమేరకు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కార్మికుల అంశం ఉమ్మడి జాబితాలో ఉందని, ఆ చట్టాల అమలును రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం వారి అధికార పరిధిలో నిర్వహిస్తాయని తెలిపారు.
 
చట్టాల అమలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ రిలేషన్ మెషినరీ (సీఐఆర్ఎం) తనిఖీ అధికారులు చూడగా, రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు పర్యవేక్షిస్తాయని మంత్రి పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Prashant Kishor Meets Nara Lokesh-ప్రశాంత్‌ కిషోర్‌తో నారా లోకేష్ భేటీ.. ఎందుకో మరి?