Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి నిప్పాన్‌ ఇండియా సిల్వర్‌ ఈటీఎఫ్‌...

Advertiesment
NIPPON INDIA MUTUAL FUND
, శుక్రవారం, 7 జనవరి 2022 (23:10 IST)
నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ (ఎన్‌ఐఎంఎఫ్‌)కు ఎస్సెట్‌ మేనేజర్‌ నిప్పాన్‌ లైఫ్‌ ఇండియా ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ (నామ్‌ ఇండియా) ఇప్పుడు నిప్పాన్‌ ఇండియా సిల్వర్‌ ఈటీఎఫ్‌ విడుదల చేసినట్లు వెల్లడించింది. ఫిజికల్‌ సిల్వర్‌ మరియు సిల్వర్‌ సంబంధిత ఇన్‌స్ట్రుమెంట్స్‌; నిప్పాన్‌ ఇండియా సిల్వర్‌ ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌ఓఎఫ్‌)లో పెట్టుబడులు పెడుతుంది. ఈ రెండు స్కీమ్‌లకూ సంబంధించి ఎన్‌ఎఫ్‌ఓ 13 జనవరి 2022న తెరువబడుతుంది, 27 జనవరి 2022వ తేదీ మూయబడుతుంది.

 
నిప్పాన్‌ ఇండియా సిల్వర్‌ ఈటీఎఫ్‌లో కనీస పెట్టుబడి మొత్తం ఈ ఎన్‌ఎఫ్‌ఓ కాలంలో 1000 రూపాయలు కాగా నిప్పాన్‌ ఇండియా సిల్వర్‌ ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌ఓఎఫ్‌)లో కనీస పెట్టుబడి మొత్తం ఈ ఎన్‌ఎఫ్‌ఓ కాలంలో 100 రూపాయలు.

 
నిప్పాన్‌ ఇండియా సిల్వర్‌ ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌ఓఎఫ్‌)తో మదుపరులు డీమ్యాట్‌ఖాతా లేకుండానే పెట్టుబడులు పెట్టడంతో పాటుగా  సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్‌ (సిప్స్‌)లో  కూడా పెట్టుబడులు పెట్టవచ్చు.

 
ఈ ఆవిష్కరణ గురించి నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ ఈటీఎఫ్‌ హెడ్‌  హేమన్‌ భాటియా మాట్లాడుతూ ‘‘నిప్పాన్‌ ఇండియా సిల్వర్‌ ఈటీఎఫ్‌ మరియు నిప్పాన్‌ ఇండియా సిల్వర్‌ ఈటీఓఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ ఆవిష్కరణతో  గోల్డ్‌ ఈటీఎఫ్‌, గోల్డ్‌ ఎఫ్‌ఓఎఫ్‌లో అగ్రగామిగా  కమోడిటీ విభాగంలో మదుపరులకు అదనపు బిల్డింగ్‌ బ్లాక్‌ను అందిస్తున్నాం. చారిత్రకంగా చూస్తే వెండికి, భారతీయ ఈక్విటీ సూచీలలో అతి తక్కువ సంబంధం ఉంది. అందువల్ల, మదుపరులకు తమ ఆస్తుల కేటాయింపులో భాగంగా వారి పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడానికి ఇది చక్కటి అవకాశం అందిస్తుంది.

 
అంతేకాదు నిప్పాన్‌ ఇండియా సిల్వర్‌ ఈటీఎఫ్‌ లేదా నిప్పాన్‌ ఇండియా సిల్వర్‌ ఈటీఓఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌ఓఎఫ్‌) ద్వారా పెట్టుబడులు పెట్టడం వల్ల సౌకర్యవంతమైన స్టోరేజీ లభించడంతో పాటుగా చిన్నమొత్తాలలో పెట్టుబడులు పెట్టడం, దొంగిలించబడుతుందనే భయం లేకపోవడం, అతి సులభమైన లిక్విడిటీ సాధ్యం కావడంతో పాటుగా వెండి స్వచ్ఛత పట్ల కూడా ఆందోళన ఉండదు’’ అని అన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై జరిగిన అన్యాయాన్ని ఖండించిన శివరాజ్ సింగ్ చౌహాన్