Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నెమెట్‌షెక్ గ్రూప్ హైదరాబాదులో కొత్త గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ ప్రారంభం

Advertiesment
Global Capability Center

ఐవీఆర్

, మంగళవారం, 9 సెప్టెంబరు 2025 (17:02 IST)
హైదరాబాద్: ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్స్ రంగంలో డిజిటల్ రూపాంతరాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత సంస్థ నెమెట్‌షెక్ గ్రూప్, తెలంగాణలోని హైదరాబాద్‌లో తన ఆధునిక గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌ను ఈ రోజు ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ అత్యాధునిక సదుపాయాన్ని ప్రధాన అతిథులుగా విచ్చేసిన ఐ.ఎస్.ఎఫ్ ఫౌండేషన్ హైదరాబాద్ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య కార్యదర్శి- ముఖ్యమంత్రి ఐటి సలహాదారు శ్రీ జె.ఏ. చౌదరి, నెమెట్‌షెక్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శ్రీమతి లూయిస్ ఓఫ్వర్‌స్ట్రోమ్ అధికారికంగా ప్రారంభించారు.
 
2025 సెప్టెంబర్ 9న జరిగిన ఈ ప్రారంభోత్సవం, భారత్‌లో నెమెట్‌షెక్ వ్యూహాత్మక విస్తరణలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ప్రస్తుత కార్యకలాపాలకు తోడు ఈ కొత్త విస్తరణ ఆధునిక పరిశోధన, వినూత్న సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, గ్లోబల్ టీమ్‌లతో సహకారం కోసం ఒక కేంద్రంగా పనిచేస్తుంది. ఈ కొత్త GCCలో R&D బృందాలు, సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్, అలాగే ప్రధాన జనరల్ & అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు ఒకే చోట ఉండబోతున్నాయి. 250 మందికి పైగా పూర్తి స్థాయి సిబ్బందిని కలుపుకునే సామర్థ్యం కలిగిన ఈ సదుపాయం, భారతదేశంలోని అత్యంత చురుకైన టెక్నాలజీ ఎకోసిస్టమ్‌లో నెమెట్‌షెక్ తన ఉనికిని బలపరచాలనే సంకల్పాన్ని మరింత స్పష్టంగా తెలియజేస్తుంది.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, నెమెట్‌షెక్ గ్రూప్ సీఎఫ్‌ఓ శ్రీమతి లూయిస్ ఓఫ్వర్‌స్ట్రోమ్ గారు చెప్పారు. హైదరాబాద్‌లో మా కొత్త కార్యాలయం ప్రారంభంతో, మేము కేవలం మా ఉనికిని విస్తరించడం మాత్రమే కాదు, మరింత విభిన్నమైన, బహుముఖ కేంద్రాన్ని సృష్టిస్తున్నాం. ఇది కేవలం R&D సెంటర్‌గానే కాకుండా, మా R&D బృందాలు, సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్, ఇతర G&A విభాగాలను ఒకే చోట కలుపుతుంది. ఈ కారణంగా దీన్ని గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (GCC)గా పిలవడం ప్రారంభిస్తున్నాం, ఎందుకంటే ఇది గ్రూప్‌లో ఇన్నోవేషన్, సహకారం, ఆపరేషనల్ ఎక్సలెన్స్‌ను ముందుకు నడిపించే కీలక పాత్ర పోషిస్తుంది.
 
నెమెట్‌షెక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ విశాల్ మణి ఇలా అన్నారు, ఈ కొత్త సదుపాయం భారతదేశంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక వాతావరణంపై నెమెట్‌షెక్ యొక్క దీర్ఘకాలిక దృష్టి, కట్టుబాటుకు నిదర్శనం. ఇది మా బృందాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కస్టమర్ల కోసం ఆధునిక ఆవిష్కరణలకు తోడ్పడే అవకాశాలను ఇస్తుంది. అలాగే తెలంగాణలోని శక్తివంతమైన ఎకోసిస్టమ్‌తో మరింత సన్నిహిత భాగస్వామ్యం కోసం మార్గం సుగమం చేస్తుంది.
 
నెమెట్‌షెక్ గ్రూప్ చీఫ్ డివిజన్ ఆఫీసర్ శ్రీ సునీల్ పండిత ఇలా అన్నారు, భారతదేశం ప్రతిభ, వినూత్నతలలో ముందంజలో ఉంది. ఈ కేంద్రం ద్వారా ఈ రెండు అంశాలను వినియోగించి, AEC/O రంగ భవిష్యత్తును తీర్చిదిద్దే మా లక్ష్యాన్ని వేగవంతం చేసుకోగలుగుతాం. గ్లోబల్ నైపుణ్యాన్ని, స్థానిక ప్రతిభను కలిపి, హైదరాబాద్‌లో నిజమైన ఇన్నోవేషన్ హబ్‌ను నిర్మిస్తున్నాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాటలు సరిగా రాని మైనర్ బాలికపై అత్యాచారం