Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రయాణికుల కోసం కాంటాక్ట్‌లెస్‌ బోర్డింగ్‌: వారణాసి ఎయిర్‌పోర్ట్‌లో డిజి యాత్ర ప్రారంభం

Advertiesment
plane
, మంగళవారం, 6 డిశెంబరు 2022 (22:19 IST)
విమానాశ్రయాలలో బోర్డింగ్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఉద్దేశించబడినదే ఈ డిజి యాత్ర. భారతదేశంలో ఫేసియల్‌ రికగ్నిషన్‌, బయోమెట్రిక్‌ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా నిల్చిన ఎన్‌ఈసీ ఈ డిజియాత్రను రూపొందించింది. భారతదేశంలో ఫేసియల్‌ రికగ్నిషన్‌, బయోమెట్రిక్‌ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా నిల్చిన సంస్థ ఎన్‌ఈసీ ఇండియా. ఇప్పటికే టెక్‌ సొల్యూషన్స్‌లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన NEC ఇప్పుడు ఎయిర్‌పోర్టుల్లో కాంటాక్ట్‌లెస్‌ బోర్డింగ్‌ కోసం డిజియాత్రను సగర్వంగా ప్రారంభించింది. 2022 డిసెంబర్‌ 1న ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (FRT), బయోమెట్రిక్ టెక్నాలజీ ద్వారా ప్రయాణీకుల కాంటాక్ట్‌లెస్ బోర్డింగ్‌ను ప్రారంభించింది. దీనిద్వారా దేశంలోని డిజిటల్ ఫ్రేమ్‌వర్క్‌ను మరో స్థాయికి తీసుకువెళ్లడంలో ఎన్‌ఈసీ ఇండియా కృషి చేసింది.
 
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా.. వారణాసి విమానాశ్రయంలో డిజియాత్ర కార్యక్రమాన్ని వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి పౌరుడు చాలా సులభంగా తమ ప్రయాణాన్ని పూర్తి చేసేందుకు ఈ డిజియాత్ర ఎంతగానో సహాయపడుతుంది ఫేసియల్ రికగ్నిషన్ ప్లాట్‌ఫారమ్ అందించే ఆప్ట్-ఇన్ సర్వీస్‌, ప్రయాణీకులు ఫిజికల్‌ డాక్యుమెంట్‌లైన పాస్‌పోర్ట్‌లు మరియు బోర్డింగ్ పాస్‌లను సమర్పించాల్సిన సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది. సేవలను పొందేందుకు ప్రయాణీకులు తమ వివరాలను డిజియాత్ర యాప్‌లో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫేసియల్‌ రికగ్నిషన్‌తో పాటు, ఎన్‌ఈసీ యొక్క కియోస్క్ టెర్మినల్స్, బయోమెట్రిక్-ఎనేబుల్‌ ఈ-గేట్‌లు, రాబోయే రోజుల్లో దేశంలోని ప్రయాణీకులకు బోర్డింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
 
డిజియాత్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు వారణాసి, కోల్‌కతా, పూణె, విజయవాడ లాంటి నాలుగు వేర్వేరు విమానాశ్రయాలలో బయోమెట్రిక్ బోర్డింగ్ ప్లాట్‌ఫారమ్‌ను అమలు చేయడానికి డిసెంబర్ 2019లో ఎన్‌ఈసీ ఇండియా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుండి కాంట్రాక్టును గెల్చుకుంది. మొదటి దశలో భాగంగా డిజియాత్ర దేశంలో 7 విమానాశ్రయాలలో ప్రారంభించబడుతుంది. ఇది ప్రస్తుతం బెంగళూరు, వారణాసి, న్యూఢిల్లీ విమానాశ్రయాలలో అమలులో ఉంది. రెండో దశలో భాగంగా, హైదరాబాద్, కోల్‌కతా, పూణే, విజయవాడ విమానాశ్రయాలలో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత దేశంలోని అనేక ఇతర విమానాశ్రయాలలో కూడా మొదలవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలను విస్తృతపరిచేందుకు కార్‌ప్రోతో చేతులు కలిపిన టర్టెల్‌ వ్యాక్స్‌ ఇండియా